Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ కుక్క నటన మాములుగా లేదుగా.. వీడియో చూనిన నెటిజనం షాక్ ..

నడంకంటే కళ్లతో చూసినప్పుడు కలిగే థ్రిల్ వేరుగా ఉంటుంది. ఇక ఏదైనా ఆపద ఎదురైనప్పుడు జంతువులు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. మనిషిని మించిన నటనను ప్రదర్శిస్తుంటాయి.

Viral Video: ఈ కుక్క నటన మాములుగా లేదుగా.. వీడియో చూనిన నెటిజనం షాక్ ..
Dog
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2021 | 12:56 PM

కోటి విద్యలు కూటి కోసమే అనే నానుడి అందరికి తెలిసిందే.. మనిషి జీవితంలో ఎదురయ్యే ఎన్నెన్నో అనుభవాలను వ్యక్తీకరిస్తూ ఇలాంటి సామెతలు జీవిత సత్యాలను తెలుపుతుంటాయి. ఇకపోతే మనిషి ఏ విద్య నేర్చుకున్న తనకున్న జానెడు పొట్టను నింపుకోవడానికే.. ఇదే కాకుండా తాను నేర్చిన విద్యలు కూడా ఒక్కొక్క సారి ప్రాణాలను కాపాడుతాయి. ఇలాంటి సంఘటనలు మనుషుల కంటే జంతువుల విషయాల్లో ఎక్కువగా కనబడతాయి.. చిన్నప్పుడు ఇలాంటి ఘటనలను మాస్టార్లు పాఠాల రూపంలో చెబుతుంటే ఆసక్తిగా వినే వాళ్లం.. అయితే వినడంకంటే కళ్లతో చూసినప్పుడు కలిగే థ్రిల్ వేరుగా ఉంటుంది. ఇక ఏదైనా ఆపద ఎదురైనప్పుడు జంతువులు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. మనిషి కూడా వాటి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.

శునకాలు ఎంత విశ్వాసంగా ఉంటాయో నటించడంలోనూ అంతే ఆరితేరి ఉంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. ఈ వీడియోలో కనిపించే కుక్క తెలివిగా ప్రజలను ఆకర్షించడానికి ప్రత్యేక శైలిని అవలంబిస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కుక్క తన నాలుగు కాళ్లతో నేలపై నడుస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ఈ క్లిప్ చూస్తుంటే  అది చాలా బాధలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎంతలా అంటే ఎదో ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయేమోఅన్నంతలా వాటి నటన ఉంటుంది. కానీ కాసేపటి తర్వాత అదంత నటన అని మనకు నిర్దారణ అవుతుంది. ఈ కుక్క  చేసిన నటన చూస్తే మనం వెండి తెర నటులను మించిపోతుదో ఏమో అనిపిస్తుంది. .

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ప్రజలు తమ స్పందనను కూడా తెలియజేస్తున్నారు. ఒక యూజర్ మరో అడుగు ముందుకేసి ‘దీనికి మూవీలో ఛాన్స్ ఇప్పించాలి’  అంటూ కామెంట్ చేశాడు. అదే సమయంలో వీడియోలో కనిపించే కుక్క చాలా తెలివైనదని.. అలాంటి పెంపుడు జంతువు మనతో ఉండాలని మరొక యూజర్ రాశాడు. మరొక నెటిజన్ ఇలా వ్రాశారు.. ‘ఈ కుక్కకు ఆస్కార్ రావాలి.’ ఫన్నీ కామెంట్స్ చేశారు.

మీ సమాచారం కోసం ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌పోస్ట్స్ పేరుతో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది సార్లు వీక్షించారు. పెద్ద సంఖ్యలో నెటిజన్లు దీనిని ఇష్టపడ్డారు. సరే, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చెప్పండి? మీరు ఈ వీడియో గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..