లోకల్ రైలులో దారుణం.. వేధింపులను ప్రశ్నించిన యువతిని పట్టాలపైకి తోసేసిన వ్యక్తి!
ముంబై లోకల్ రైలులో మహిళపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 4న నైగావ్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో తనను వేధించడాన్ని నిరసించిన యువతిపై ఓ వ్యక్తి దాడి చేసి రైలు పట్టాలపైకి తోసేశాడు. అదే సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె ఎడమ చేయి మోచేతి వద్ద తెగిపోయింది.

Local Train Horror
ముంబై లోకల్ రైలులో మహిళపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 4న నైగావ్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో తనను వేధించడాన్ని నిరసించిన యువతిపై ఓ వ్యక్తి దాడి చేసి రైలు పట్టాలపైకి తోసేశాడు. అదే సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె ఎడమ చేయి మోచేతి వద్ద తెగిపోయింది. తలకు తీవ్ర గాయాలవడంతో 16 కుట్లు వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
