AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా స్కిన్ కలర్‌తోనే నాకు కెప్టెన్సీ ఇవ్వలేదు.. ఉస్మాన్ ఖవాజా సంచలన ఆరోపణ.. కమిన్స్ స్ట్రాంగ్ కౌంటర్

Usman Khawaja Skin Colour Australia Captaincy Claim: తన ‘సబర్’ పుస్తకంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన సంచలన వ్యాఖ్యలు క్రికెట్ ఆస్ట్రేలియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘గోధుమ రంగు చర్మం ఉన్న ఆటగాడిని కెప్టెన్‌గా చూడడానికి ఆస్ట్రేలియా సిద్ధంగా లేదు’ అన్న ఖవాజా ఆరోపణలను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించారు. సాక్ష్యం ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.

నా స్కిన్ కలర్‌తోనే నాకు కెప్టెన్సీ ఇవ్వలేదు.. ఉస్మాన్ ఖవాజా సంచలన ఆరోపణ.. కమిన్స్ స్ట్రాంగ్ కౌంటర్
Usman Khawaja Skin Colour Australia Captaincy Claim
Venkata Chari
|

Updated on: Nov 13, 2026 | 8:38 AM

Share

Usman Khawaja Skin Colour Australia Captaincy Claim: ఆస్ట్రేలియా క్రికెట్‌ను 2018లో కుదిపేసిన కేప్‌టౌన్ ‘సాండ్‌పేపర్‌గేట్’ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి బాల్ ట్యాంపరింగ్ కంటే మించిన తీవ్రమైన అంశంతో జాతి వివక్ష, కెప్టెన్సీ ఎంపిక. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తన ఆత్మకథ ‘సబర్’ (Sabr – అంటే సహనం) లో పాకిస్థాన్‌లో జన్మించి చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకు వలసవచ్చిన తొలి ఆస్ట్రేలియా జాతీయ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా తన మనసులో దాచుకున్న ఆవేదనను బయటపెట్టారు.

2018లో స్టీవ్ స్మిత్‌ను కేప్‌టౌన్ నుంచి ఇంటికి పంపించినప్పుడు ఇంటరీమ్ కెప్టెన్‌గా తానే సహజమైన ఎంపికనని ఖవాజా పేర్కొన్నారు. ఆ సమయంలో దేశవాళీ క్రికెట్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తనను కాదని టిమ్ పైన్‌కు పగ్గాలు అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తర్వాత 2021లో పైన్ తర్వాత ప్యాట్ కమిన్స్ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యారు. “నేను ఇంటరీమ్ కెప్టెన్‌గా సహజమైన ఎంపిక, కానీ నన్ను పక్కనపెట్టారు” అని ఖవాజా పుస్తకంలో రాశారు.

దీనికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఒకటి – క్రికెట్ ఆస్ట్రేలియాతో పే వివాదంలో ఆటగాళ్ల తరఫున ముందుండి పోరాడటం. రెండోది, ఆయన మాటల్లోనే చెప్పాలంటే – “మరింత ముఖ్యమైన కారణం – ఇంటరీమ్‌గానైనా ఒక బ్రౌన్ (గోధుమ రంగు చర్మం ఉన్న) ఆస్ట్రేలియన్ క్రికెట్ కెప్టెన్‌ను చూడడానికి వారు సిద్ధంగా లేరు.”

ఇవి కూడా చదవండి

ఖవాజా చిన్నతనం నుంచి జాతి వివక్షను ఎదుర్కొన్న విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. దీంతో ఆయన ఆరోపణలు ఆస్ట్రేలియా సమాజంలో చర్చకు దారితీశాయి.

ఈ ఆరోపణలను ప్రస్తుత టెస్ట్, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై సమాధానం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఖవాజా పుస్తకంలోని చాలా అంశాలతో ఏకీభవిస్తున్నానని, కానీ ‘స్కిన్ కలర్’ వ్యాఖ్యను మాత్రం పూర్తిగా తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు.

“నేను చదివిన వాటిలో ఇదే అత్యంత తీవ్రమైన ఆరోపణ. నేను నిర్వహిస్తున్న పదవి చర్మం రంగు ఆధారంగా కొందరికి దూరంగా ఉంచబడిందని అనుకోవడం చాలా పెద్ద ప్రకటన. అలా అంటున్నప్పుడు సాక్ష్యం ఉండాలి. కానీ అది నిజం అని నేను అనుకోవడం లేదు” అని కమిన్స్ ఘాటుగా బదులిచ్చారు.

“ఉస్మాన్ చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తాను. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ కావాలంటే నిర్దిష్ట చర్మం రంగు ఉండాలనే వాదనతో నేను విభేదిస్తున్నాను” అని తేల్చి చెప్పారు.

కెప్టెన్ అయిన తర్వాత తన దృష్టికి వచ్చిన జాతివివక్ష ఘటనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా – “దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది బహుశా ఉజ్జీ (ఖవాజా ముద్దుపేరు) చెప్పాల్సిన కథ. కానీ నేను కెప్టెన్ అయినప్పటి నుంచి నాకు గుర్తున్నంతవరకు అలాంటిదేమీ లేదు” అని కమిన్స్ సమాధానమిచ్చారు.

ఖవాజా పుస్తకంలోని సాండ్‌పేపర్‌గేట్ అంశాలను కమిన్స్ ‘నాన్సెన్స్’ అని కొట్టిపారేయడం, ఇప్పుడు కెప్టెన్సీపై సాక్ష్యం అడగడం – ఈ పరిణామాలు ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలను బహిరంగం చేశాయి. ఆస్ట్రేలియా క్రికెట్ సంస్కృతిపై మరోసారి ఆత్మపరిశీలనకు ఇది దారితీస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us