AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మృగరాజును బానిసగా చేసుకున్న వానరం..?? సింహంపై స్వారీ చేస్తూ హల్‌చల్‌ !

అడవిలో అనూహ్యమైన దృశ్యం కనిపించింది. వైరల్ అవుతున్న వీడియో సింహాలు,  కోతికి సంబంధించినది. వీడియోలో కనిపించినట్టుగా ఒక కోతి సింహంపై స్వారీ చేస్తూ హల్ చల్ చేస్తుంది.

Viral News: మృగరాజును బానిసగా చేసుకున్న వానరం..?? సింహంపై స్వారీ చేస్తూ హల్‌చల్‌ !
Monkey Sitting On Lion
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2023 | 8:43 AM

Share

ఇంటర్నెట్ అంటేనే ఎన్నో అద్భుతాలతో నిండిన ఒక భిన్నమైన ప్రపంచం. ఇక్కడ అనేక రకాలైన విషయాలను నేర్చుకుంటాము. ఇక్కడ షేర్ చేయబడిన వార్తలు, కథనాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో కూడిన వినోదాత్మక మార్గం. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న టెన్షన్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. ఈ విభిన్న వీడియోలను ఆస్వాదించే అభిమానులు ఉన్నారు. ఇకపోతే, సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియో వైరల్‌ నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందులో వానర చేష్టలను మరీ ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక కోతికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

అయితే, కోతులు చేసే వికృత చేష్టలు అనేకం మనం చూసాం. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోతులు కొంటె జంతువులు, చిరుతపులులు, పులులు, సింహాలు క్రూర జంతువులు. అలాంటి క్రూర మృగాలతో జతకట్టింది ఒక కోతి.. ఇలాంటి అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలో అనూహ్యమైన దృశ్యం కనిపించింది. వైరల్ అవుతున్న వీడియో సింహాలు,  కోతికి సంబంధించినది. వీడియోలో కనిపించినట్టుగా ఒక కోతి సింహంపై స్వారీ చేస్తున్నట్లు చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో రెండు సింహాలు అటవీ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు ఒక కోతి సింహం వీపుపై కూర్చుని స్వారీ  చేయటం ప్రారంభించింది. సింహం కూడా కోతిని ఏమీ చేయకుండా ప్రశాంతంగా ముందుకు కదిలింది. ఇందులో కోతి రాజు, సింహం అతని పెంపుడు జంతువు మాదిరిగా కనిపించాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియోలోని దృశ్యం నిజం కాదు.. ఎడిటింగ్‌ అంటూ కొట్టిపారేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..