AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్‌నైట్‌ అంటే పారిపోయి పక్కింట్లో దాక్కున్న పెళ్లికొడుకు.. కారణం తెలిసి కంగుతిన్న వధువు..!

అసలు దాక్కున్నాడో లేదో తెలియదు. అయితే ఈ మ్యాగజైన్ పేజీలను కొందరు మీమ్స్ కోసం ఇలా ఫోటోషాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను కామెడీగానే తీసుకుంటున్నారు నెటిజన్లు.

ఫస్ట్‌నైట్‌ అంటే పారిపోయి పక్కింట్లో దాక్కున్న పెళ్లికొడుకు.. కారణం తెలిసి కంగుతిన్న వధువు..!
First Night
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2023 | 8:19 AM

Share

కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఫస్ట్‌నైట్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. ఒక వరుడు తనకోసం ఎదురు చూస్తున్న నవ వధువు నుంచి తప్పించుకుని పొరుగింట్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అవును, ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్థానిక వార్తాపత్రిక ఇలాంటి వింత సంఘటన గురించి వెల్లడించింది. తాజాగా ఓ దినపత్రికలో ప్రచురించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లైన వరుడు ఫస్ట్‌నెట్‌ రోజు రాత్రి ఇంట్లోకి పారిపోయి పక్కింట్లో దాక్కున్నాడు. దీనికి కారణం అతని సిగ్గుపడే స్వభావమేనట.

మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా.. వరుడు మొదటి రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. వరుడి ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రంతా వెతికారు. కానీ, అతడు ఎక్కడా కనిపించలేదు.. పైగా తన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి పెట్టుకున్నాడు. చివరకు తెలిసిందేంటంటే.. అతను పొరుగువారి ఇంట్లో దాక్కున్నాడని.

రాత్రంతా వెతికిన కుటుంబ సభ్యులకు వరుడి ఆచూకీ దొరక్క ఆందోళనపడ్డారు. కానీ, ఆ మరుసటి రోజు ఉదయం అతను తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతనిని సంప్రదించారు. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ‘నాకు సిగ్గుగా ఉంది’ అన్నాడట.. అంతేకాదు.. రాత్రి పూట ఇంటికి తిరిగొచ్చేంత ధైర్యం లేదని తేల్చి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

పెళ్లికొడుకు హనీమూన్‌కి ఎందుకు పారిపోయాడు అనే వార్త మాత్రం గంటల వ్యవధిలోనే ఊరువాడా దాటి దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. అయితే, ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ పెట్టారు. అసలు దాక్కున్నాడో లేదో తెలియదు. అయితే ఈ మ్యాగజైన్ పేజీలను కొందరు మీమ్స్ కోసం ఇలా ఫోటోషాప్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తను కామెడీగానే పరిగణిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..