AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్ఫెక్ట్ ఉమెన్‌గా మారేందుకు రూ.8కోట్లు ఖర్చు.. కట్ చేస్తే.. అందం జైలుగా మారందంటూ కన్నీళ్లు

తన అందం ఇప్పుడు తనకు ఒక ‘జైలు’గా మారిందని జనైనా ప్రజెరెస్ స్వయంగా చెప్పిన మాట. 35 సంవత్సరాల జనైనా ప్రజెరెస్ 'పర్ఫెక్ట్ ఉమెన్'గా ఎంపికైంది. ఈ మోడల్ తన శరీరంలో కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించి మాట్లాడటానికి ఎటువంటి సమస్య లేదని చెప్పింది తాను ప్లాస్టిక్ సర్జరీ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

పర్ఫెక్ట్ ఉమెన్‌గా మారేందుకు రూ.8కోట్లు ఖర్చు.. కట్ చేస్తే.. అందం జైలుగా మారందంటూ కన్నీళ్లు
Model Janaina PrazeresImage Credit source: Instagram/@janaina3
Surya Kala
|

Updated on: Sep 18, 2024 | 12:53 PM

Share

బ్రెజిల్‌కు చెందిన 35 సంవత్సరాల జనైనా ప్రజెరెస్ కథ నేటి యుతులకు ఒక మెసేజ్ ని ఇస్తుంది.. అంతేకాదు నేటి సమాజంలో అందం, గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన సవాళ్లను తెలియజేస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పనిచేసే వ్యక్తులు ఆకర్షణీయంగా కనిపించడానికి తరచుగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి శారీరకంగా, మానసికంగా వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తన అందం ఇప్పుడు తనకు ఒక ‘జైలు’గా మారిందని జనైనా ప్రజెరెస్ స్వయంగా చెప్పిన మాట. 35 సంవత్సరాల జనైనా ప్రజెరెస్ ‘పర్ఫెక్ట్ ఉమెన్’గా ఎంపికైంది. ఈ మోడల్ తన శరీరంలో కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించి మాట్లాడటానికి ఎటువంటి సమస్య లేదని చెప్పింది తాను ప్లాస్టిక్ సర్జరీ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని జనైనా ఎప్పుడూ కోరుకుంటుంది. అందుకోసం ఆమె కాస్మెటిక్ సర్జరీని ఆశ్రయించింది. దీని కోసం 7,58,000 పౌండ్లు (అంటే మన దేశ కరెన్సీలో రూ. 8.35 కోట్లకు పైగా) వెచ్చించింది. అయితే ఇప్పుడు తను చేసిన పని విషయంలో జనైనా పశ్చాత్తాపం పడుతోంది. నేను చాలా పేరు, డబ్బు సంపాదించాను.. అయితే తనపట్ల ప్రజల ప్రవర్తన, వారి అంచనాలతో విసిగిపోయానని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరూ ఎప్పుడు తాము మచ్చ లేని చందమామలా ఉండాలని ఆశిస్తారు. ఇదే విషయంపై జనైనా మాట్లాడుతూ అందంగా ఉండటం వల్ల కొన్నిసార్లు ప్రజలు తనని ఒక వస్తువుగా లేదా ట్రోఫీగా చూస్టారు. నా అందం నా పాలిట ‘జైలు’ అయిపోయిందని వాపోయింది. అంతేకాదు ఆమె ఇంకా మాట్లాడుతూ.. సాటి మహిళలతో స్నేహాన్ని కొనసాగించడం కూడా కష్టం.. ఎందుకంటే తను తరచుగా పోటీపడే సమయంలో అసూయతో కూడిన వాతావరణాన్ని చూస్తాను. ఇలాంటి సందర్భాల్లో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం. కొనసాగించడం కష్టతరంగా మారుతుందని చెప్పింది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

అయితే తాను ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ నుండి వెనక్కి తగ్గే ఆలోచన లేదని స్పష్టం చేసింది జనైనా. ఇప్పటి వరకు ఆమె మూడు సార్లు ముక్కు జాబ్‌లు, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్, పక్కటెముకల తొలగింపు సహా ఎన్ని ఆపరేషన్స్ చేయించుకుంది. ఆమె గత 10 సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకోసారి బొటాక్స్, లిప్ ఫిల్లర్స్, బట్ ఫిల్లర్స్, చిన్ ఫిల్లర్స్, అండర్ ఐ ఫిల్లర్స్ వంటి బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి భవిష్యత్‌లో మహిళలు తమ గుణాలు, బలాలతో గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్లు జనైనా చెప్పారు. అందం, గ్లామర్ లతో ఆనందం, సమాజంలో గౌరవం లభిస్తుంది అని భావించే వారికి జానైన భావాలు, ఆమె పరిస్థితి ఒక హెచ్చరిక కావచ్చు.