Sleep Tips: ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..

ఏడెనిమిది గంటలు నిద్రపోవడమే కాదు, సరైన సమయానికి నిద్రపోవడం కూడా అవసరం. చాలా సార్లు ప్రజలు సరైన సమయంలో నిద్రపోరు. అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటారు. తర్వాత నిద్ర సరిపోలేదంటు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ నేపధ్యంలో సరైన సమయంలో మంచి నిద్ర రావాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. అలవాట్లకు గుడ్ బై చెప్పాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Sleep Tips: ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని నియమాలున్నాయి.. అవి ఏమిటంటే..
మధ్యాహ్న నిద్ర శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా రిలాక్స్ చేస్తుంది. రోజులో దాదాపు 1 గంట నిద్రపోవడం వల్ల శరీరం కండరాలు మొత్తం విశ్రాంతి పొందుతాయి. అలాగే ఈ నిద్ర మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత, రిఫ్రెష్‌గా కనిపిస్తారు.
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2024 | 12:24 PM

మంచి ఆరోగ్యానికి శారీరక శ్రమ ఎంత ముఖ్యమో, శరీరానికి తగిన విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంతో పాటు మనసూ కూడా విశ్రాంతి పొందుతుంది. రోజంతా పని చేసి అలసిన శరీరం విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రశాంతంగా నిద్రపోవడం ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతె బరువు పెరగడం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, మానసిక కల్లోలం, ఒత్తిడి పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల, ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు సుఖ మైన, ఒత్తిడి లేని నిద్ర పొడవాలి.

ఏడెనిమిది గంటలు నిద్రపోవడమే కాదు, సరైన సమయానికి నిద్రపోవడం కూడా అవసరం. చాలా సార్లు ప్రజలు సరైన సమయంలో నిద్రపోరు. అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటారు. తర్వాత నిద్ర సరిపోలేదంటు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ నేపధ్యంలో సరైన సమయంలో మంచి నిద్ర రావాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. అలవాట్లకు గుడ్ బై చెప్పాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ప్రతి ఉదయం వ్యాయామం చేయండి

ఇవి కూడా చదవండి

శరీరాన్ని ఆకృతిలో ఉంచుకోవడానికి.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం మిమ్మల్ని మరింత చురుగ్గా చేయడమే కాదు నిద్ర పోయే విధానాన్ని మెరుగుపరుస్తుంది. అయితే చాలా మంది సాయంత్రం కూడా విపరీతమైన వ్యాయామం చేస్తారు. అయితే ఇలా నిద్రపోయే ముందు భారీ వ్యాయామాలు చేయకూడదని గుర్తుంచుకోండి.

ఫోన్, టీవీకి దూరంగా ఉండండి

రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడానికి లేదా ఆలస్యంగా మేల్కొవడానికి స్క్రీన్ టైమింగ్ కూడా అతి పెద్ద కారణం. కొంతమంది పని కారణంగా మెలకువగా ఉండాల్సి వస్తే చాలా మంది ఫోన్ లో ఆడుకుంటూ లేదా టీవీ చూస్తూ మెలకువగా ఉంటారు. ఈ అలవాటును క్రమంగా తగ్గించుకోవాలి. స్క్రీన్ లైట్ కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా ఫోన్‌ వాడకం తగ్గించిన తర్వాత కూడా నిద్రపోలేరు. నిద్రించడానికి గంట ముందు ఫోన్, టీవీకి దూరంగా ఉండాలి.

రాత్రి భోజనం నిద్ర మధ్య గ్యాప్

మంచి నిద్ర కోసం, ఆహారం సరిగ్గా జీర్ణం కావడం ముఖ్యం. కనుక రాత్రి ఆహారం తినడానికి, నిద్ర పోవడానికి మధ్య కనీసం రెండు నుండి రెండున్నర గంటల గ్యాప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే , తక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని చేర్చుకోండి. ఆహారం తిన్న తర్వాత కాసేపు నడవండి.

కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవడం తగ్గించండి

ఆఫీసులో లేదా ఇంట్లో పని చేసేటప్పుడు ప్రజలు అలసిపోయినట్లు లేదా నీరసంగా అనిపించిన వెంటనే కాఫీ లేదా టీ తాగుతారు. రోజంతా అనేక కప్పుల టీ, కాఫీ తీసుకునే వారిలో మీరు కూడా ఒకరు అయితే.. ఈ అలవాటు నిద్ర పట్టడంలో సమస్యలను కలిగిస్తుంది. కనుక పరిమిత పరిమాణంలో మాత్రమే కెఫిన్ పానీయాలను తీసుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

మంచి నిద్ర కోసం మంచి వాతావరణం కూడా ముఖ్యం. కనుక బెడ్ రూమ్ లో కాంతిని ఎక్కువగా ఉంచవద్దు. ఇది నిద్ర రాకుండా నిరోధిస్తుంది. అంతేకాదు గది ఉష్ణోగ్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటె నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకోండి. అదే సమయంలో పండ్లకు దూరంగా ఉండండి. ఇలా చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని పాటిస్తే మంచి నిద్ర పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాటకులకు అవగాహన కోసం మాత్రమే .. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. వీటిని ఫాలో అయ్యేముందు నిపుణులు లేదా డాక్టర్లను సంప్రదించండం మేలు)

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!