America: ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు.. ఈ నెలలో అమెరికాకు ప్రధాని మోడీ.. షెడ్యుల్ డీటైల్స్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పారు. అయితే ర్యాలీలో భారత్ వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు.. అదే సమయంలో ప్రధాని మోడీని అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. వచ్చే వారం మోడీ తనను కలవడానికి వస్తున్నారని ట్రంప్ అన్నారు. వాస్తవానికి ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు కానప్పటికీ.. విదేశీ దేశాధినేతలను కలుస్తూనే ఉన్నారు.

America: ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు.. ఈ నెలలో అమెరికాకు ప్రధాని మోడీ.. షెడ్యుల్ డీటైల్స్
Pm Modi Us TourImage Credit source: IANS
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2024 | 11:23 AM

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పదవి కోసం ఓ రేంజ్ లో పోటీ జరుగుతోంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. కమలా దేవి హారిస్‌ ల మధ్య మాటల యుద్ధం కూడా ఓ రేంజ్ లో సాగుతోంది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ మన దేశం ప్రధాని నరేంద్ర మోడీని అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రసంశల వర్షం కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిచిగాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చెప్పారు. అయితే ర్యాలీలో భారత్ వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు.. అదే సమయంలో ప్రధాని మోడీని అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. వచ్చే వారం మోడీ తనను కలవడానికి వస్తున్నారని ట్రంప్ అన్నారు. వాస్తవానికి ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు కానప్పటికీ.. విదేశీ దేశాధినేతలను కలుస్తూనే ఉన్నారు. జూలైలో ఫ్లోరిడాలో హంగేరియన్ జాతీయవాద ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌ను కూడా కలిశారు. ఈ వారంలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు.

క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ డెలావేర్‌లోని విల్మింగ్టన్‌కు వెళ్తున్నారు. ఇది అధ్యక్షుడు జో బిడెన్ స్వస్థలం. క్వాడ్ సమావేశం కూడా ఇక్కడే జరగేటట్లు ప్రతిపాదించబడింది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో కూడా హాజరుకానున్నారు.

బిడెన్ చివరి క్వాడ్ సమ్మిట్

ఈ క్వాడ్‌లో భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు సభ్యులు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా జోక్యాన్ని ఎదుర్కోవడానికి ఈ సంస్థ ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ క్వాడ్ సమితీ రూపశిల్పి. అధ్యక్షుడిగా ఇదే బిడెన్ చివరి శిఖరాగ్ర సమావేశం.

ప్రధాని మోడీ అమెరికా పర్యటన

ప్రధాని మోడీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ముందుగా డెలావేర్‌లోని విల్మింగ్టన్‌కు చేరుకుని అక్కడ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. దీని తరువాత.. ప్రవాస భారతీయుల సమాజ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని అక్కడ ప్రసంగించనున్నారు. అనంతరం న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో పాల్గొననున్నారు.

సెప్టెంబర్ 22న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ డయాస్పోరా ఈవెంట్ న్యూయార్క్ శివారులోని యూనియన్‌డేల్‌లో జరగనుంది.. ప్రధాని మోడీ పాల్గొనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రవాస భారతీయులు 25,000 మందికి పైగా టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. AI, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్, బయోటెక్నాలజీ వంటి అధునాతన రంగాలలో భారతదేశం.. US మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ప్రముఖ US కంపెనీల CEOలతో కూడా మోడీ సమావేశం కానున్నారు. 23వ తేదీన యూఎన్ సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో మోడీ పాల్గొనున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం