Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి నుంచి డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా.. ఫుల్ డీటైల్స్ మీ కోసం

శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం టీటీడీ అధికారులు ముందుగానే పలు సేవలకు , దర్శనానికి సంబందించిన టికెట్స్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తోంది. అదే విధంగా డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్లను పొందాలనుకునే భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి నుంచి డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా.. ఫుల్ డీటైల్స్ మీ కోసం
Tirumala Temple
Follow us

|

Updated on: Sep 18, 2024 | 9:34 AM

శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ముందుగానే పలు సేవలకు , దర్శనానికి సంబందించిన టికెట్స్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తుంది. అదే విధంగా డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్లను పొందాలనుకునే భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది. కనుక ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు తమ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎలక్రానిక్ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు వరకూ సేవకు సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు లక్కీడిప్‌లో పొందిన టికెట్లు మంజూరు చేస్తారు టిటిడీ అధికారులు. డిసెంబర్ నెలలో వివిధ సేవలకు, దర్శనానికి ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవలని టిటిడీ అధికారులు సూచిస్తున్నారు.

పలు సేవలు, వర్చువల్ కోటా వివరాలు

డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలతో పాటు.. వర్చువల్ సేవల దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు.

అంగప్రదక్షిణం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులున్నవారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా

డిసెంబరు నెల‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిల‌లో గదుల కేటాయింపు కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

సెప్టెంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల

సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారి సేవకు సంబంధించిన కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం