Aishwarya Rajesh: మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు..

Aishwarya Rajesh: మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు..

Anil kumar poka

|

Updated on: Sep 18, 2024 | 10:39 AM

మలయాళీ సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ ఓ నివేదికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ముఖ్యంగా వారికి వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని హేమ కమిటీ నివేదిక వెల్లడించడంతో అన్ని భాషలలోనూ అలాంటి కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

మలయాళీ సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ ఓ నివేదికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వివక్షకు గురవుతున్నారని.. ముఖ్యంగా వారికి వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని హేమ కమిటీ నివేదిక వెల్లడించడంతో అన్ని భాషలలోనూ అలాంటి కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే కొందరు నటీమణులు కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళంలోని కొందరు నటులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ హేమ కమిటీ తరహాలో ప్రత్యేక కమిటీ కావాలని కోరుతున్నారు. ఇప్పటికే తమిళ చిత్రపరిశ్రమలో హేమ కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలని డిమాండ్ చేయడంతో నటీనటుల సంఘం నడిగర్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సంఘమే ఇప్పుడు అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ ఐశ్వర్య.

ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. నటిగా చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై సందడి చేసిన ఐశ్వర్య.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తోంది. విభిన్నమైన కథలను.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఈక్రమంలోనే ఇటీవల ఇంటర్వ్యూ డిబెట్లో కోలీవుడ్ లో ఏర్పాటు చేసిన నడిఘర్ సంఘం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులు ఎదుర్కొలేదని చెబుతూనే.. ఈ సంఘం అవసరం లేదంటూ చెప్పింది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.