TOP9 ET: రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర | అసలు ఏది నమ్మాలి? ఏంటీ రచ్చ.?

TOP9 ET: రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర | అసలు ఏది నమ్మాలి? ఏంటీ రచ్చ.?

Anil kumar poka

|

Updated on: Sep 18, 2024 | 12:48 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రేరెస్ట్ ఆఫ్‌ ది రేర్‌ రికార్డ్ నమోదు చేసింది. అమెరికా గడ్డపై ప్రీమియర్ టికెట్స్ సేల్స్‌లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. దాంతో పాటే 10 రోజుల్లోనే ఈ మూవీ టికెట్స్ 45 వేలకు పైగా అమ్ముడవ్వడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

01.Devara: రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమెరికాలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రేరెస్ట్ ఆఫ్‌ ది రేర్‌ రికార్డ్ నమోదు చేసింది. అమెరికా గడ్డపై ప్రీమియర్ టికెట్స్ సేల్స్‌లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కింది. దాంతో పాటే 10 రోజుల్లోనే ఈ మూవీ టికెట్స్ 45 వేలకు పైగా అమ్ముడవ్వడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

02.NTR-Allu Arjun: అసలు ఏది నమ్మాలి? ఏంటీ రచ్చ.?

దేవర, పుష్ప2 రెండూ మోస్ట్ అవేటెడ్ సినిమాలే..! రెండూ క్రేజీ మూవీలే..! తక్కువ గ్యాప్ తో బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్‌ అవుతున్న ఈ మూవీలలో దేవరకే క్రేజ్ ఎక్కువ ఉందని అంటున్నారు కొందరు నెటిజన్స్. అనడమే కాదు.. బుక్‌ మై షోలో… పుష్ప2 కంటే.. దేవరకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారంటూ.. బుక్‌ మై షోలోని ఇంట్రెస్ట్ బటన్‌ కేసి చూపిస్తున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్‌ ఏమో.. దేవర కంటే పుష్ప2 కోసమే ఎక్కువ వెయిటింగ్‌ వుందని అంటున్నారు. అందుకు ప్రూఫ్‌గా ఓర్‌మ్యాక్స్‌ లేటెస్ట్ సర్వేను చూపిస్తున్నారు. ఇలా నెట్టింట చిన్న పాటి డిబేట్‌ను రెయిజ్‌ చేసి.. అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏది నమ్మాలి.. అసలేంటి క్రేజ్‌ రచ్చ అనే కామెంట్‌.. కామన్‌ ఫిల్మ్ లవర్స్‌ నుంచి వచ్చేలా చేస్తున్నారు ఈ స్టార్ ఫ్యాన్స్.

03.jhani: పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు.! జానీ మాస్టర్‌కు మరో షాక్.

జానీ మాస్టర్ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతోంది. ఫిల్మ్ ఛాంబర్, ఈ ఇష్యూ పై ఫోకస్ పెట్టడం.. మరో వైపు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ పై పోలీస్‌ కేసు నమోదు అవ్వడం.. విచారణ వేగంగా జరుతుండడంతో.. జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డాడనే కామెంట్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. దీనికితోడు జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. డ్యాన్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న ఈయన్ను.. వెంటనే ఆ విధుల నుంచి తప్పించినట్టు, అసోసియేషన్‌ నుంచే సస్పెండ్‌ చేసినట్టు.. ఓ న్యూస్ బయటికి వచ్చింది.

04.mokshu: మోక్షజ్ఙ కోసం రూ.100 కోట్లు.

బాలయ్య వారసుడిగా.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మోక్షుపై 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు మేకర్స్ రెడీ అయ్యారట. మోక్షు హీరోగా.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన మోక్షు ఫస్ట్ లుక్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే మేకర్స్.. ఈ జూనియర్ లెజెండ్‌ పై 100 కోట్ల రూపాయలు పెట్టడానికి డిసైడ్ అయ్యారట. ప్రశాంత్ వర్మకు బడ్జెట్‌ విషయంలో కాస్త ఫ్రీడమ్‌ కూడా ఇస్తున్నారని టాక్.

05.mano: మనో కొడుకులు అరెస్ట్!

ఓ వారం క్రితం తమ ఫ్రెండ్స్‌తో కలిసి తాగిన మత్తులో.. ఓ ఇద్దరిపై దాడి చేసిన మనో ఇద్దరు కుమారులు.. ఎట్టకేలకు పోలీసులకు దొరికేశారు. గొడవ తర్వాత.. పోలీసులకు చిక్కకుండా పోయిన మనో కొడుకులు ఇద్దర్నీ… తాజాగా చెన్నై అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కోలీవుడ్‌ మీడియా కోట్ చేస్తోంది. దాంతో పాటే వారిద్దర్నీ విడిపించేందుకు మన స్టార్ సింగర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఓ టాక్ ఉంది.

06.NTR: దేవర నుంచి దావూదీ పాట అవుట్

దేవర నుంచి రీసెంట్‌గా రిలీజ్‌ అయిన దావూదీ పాట..యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు మంచి జోష్‌ నిచ్చింది. ఎస్పెషల్లీ.. ఆ సాంగ్‌లో తారక్‌ డ్యాన్స్‌ యంగ్ టైగర్ డై హార్డ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్.. ఈ జూనియర్ ఫ్యాన్స్‌ తో పాటు అందర్నీ డిస్సపాయింట్ చేస్తోంది. ఎందుకంటే..! ఈ సాంగ్‌ దేవర పార్ట్‌ 1 నుంచి పూర్తిగా తొలిగించారనే టాక్ బయటికి వచ్చింది కాబట్టి! ఎస్ ! గతంలో ఎండ్‌ టైటిల్స్‌లో ఈ సాంగ్‌ వస్తుందని ఓ న్యూస్ బయటికి వచ్చింది. కానీ ఇప్పుడది కూడా లేదని.. మేకర్స్ నుంచి బయటికి వచ్చిన ఓ హింట్‌తో తెలుస్తోంది.

07.koratal: ఏక్‌ధమ్‌ 30 కోట్ల రూపాయలు అందుకున్న కొరటాల శివ.

ఏక్‌ ధమ్‌ 30 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ పట్టారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ఎస్ ! అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్.. దేవర 2 పార్ట్స్‌ కోసం.. ఈ స్టార్ డైరెక్టర్ దాదాపు 30 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదే సినిమా కోసం.. దాదాపు 60 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు మరో న్యూస్ ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతోంది.

08.johnny master: వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడు.

జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు చేసిన యువతి పోలీసులు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ తన వ్యాన్‌లోకి వచ్చి తనను బలవంతం చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు. లైంగికంగా.. జానీ మాస్టర్ తనను ఎంతో వేధించాడని ఆరోపించారు. సహకరించకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానంటూ జానీ మాస్టర్ తనని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపారు. ఇక తాజాగా ఆమె ఇంట్లోనే దాదాపు 3 గంటలు ఆ యువతి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. ఆ వెంటనే ఆ యువతిని వైద్య పరీక్షలకు పంపించారు.

09.Aishwrya: అడ్డంగా దొరికిన ఐశ్యర్వ కన్ఫర్మా! వీళ్లు విడిపోయారా? (ఐశ్వర్య, అభిషేక్)

బాలీవుడ్ స్టార్‌ కపుల్ ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ డైవర్స్‌ వార్తలు మరోసారి తెర మీదకు వచ్చాయి. రీసెంట్ ఫోటోస్‌లో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకపోవటంతో అభిషేక్‌, ఐశ్వర్య విడిపోయారన్న ప్రచారం మొదలైంది. అయితే స్టిల్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 18, 2024 10:21 AM