AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miracle Man: వైద్యులకే షాక్ ఇచ్చిన మిరాకిల్ మ్యాన్.. ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు

తనకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక రోజు తన ఎడమ చేతిలో మంట అనుభూతి చెందడం ప్రారంభించానని ఆ తర్వాత తాను స్వయంగా 911కి కాల్ చేసానని ఇవాన్ చెప్పాడు. అయితే ఈ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చేసరికి ఇవాన్ ఒక్క అడుగు కూడా నడవలేక పారామెడికల్ సిబ్బంది చేతుల్లో పడ్డాడు. అతను శ్వాస తీసుకోవడం లేదు.. అయితే పారామెడిక్స్ బృందం అతనికి అంబులెన్స్ లోపల చికిత్స చేసింది.

Miracle Man: వైద్యులకే షాక్ ఇచ్చిన మిరాకిల్ మ్యాన్.. ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు
Miracle ManImage Credit source: Getty
Surya Kala
|

Updated on: Apr 27, 2024 | 2:53 PM

Share

భూమ్మీద పుట్టిన జీవి మరణించడం ఖాయం. అయితే జీవులు భూమి మీద జీవించే వయసులో ఎక్కువ తక్కువులు ఉండొచ్చు. అంతేకాని పుట్టిన ప్రతి జీవి మరణించడం తప్పదు. అయితే కొందరు చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. అయితే తాము మరణించే మళ్ళీ జీవించినట్లు కొందరు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో అమెరికాలోని న్యూజెర్సీ నివాసి ఇవాన్ హోయ్ట్ వాసర్‌స్ట్రోమ్. ఇవాన్  ఒక సారి కాదు రెండుసార్లు కాదు మొత్తం 8 సార్లు మరణించినట్లు.. ప్రతిసారీ తాను మరణించిన అనుభూతిని పొందానని.. మళ్ళీ ‘అద్భుతం’గా జీవించినట్లు పేర్కొన్నాడు.

ది వుల్వరైన్ సినిమాలో ఒక పాత్రలో నటించిన హ్యూ జాక్‌మన్‌కు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. దీంతో అతనికి మరణం రాదు. ఇప్పుడు ఇవాన్‌ను కూడా వుల్వరైన్‌తో పోల్చుతున్నారు. ఎందుకంటే అతను చనిపోయిన ప్రతిసారీ తిరిగి జీవించాడు. పరిస్థితి ఎలా ఉన్నా అతను కొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడు. LadBible నివేదిక ప్రకారం వృత్తిరీత్యా రచయిత, నిర్మాత అయిన ఇవాన్ తన కుక్కను వాకింగ్ కు తీసుకుని వెళ్లే సమయంలో ఎనిమిది సార్లు మరణించిన అనుభవం ఉంది.

40 సంవత్సరాల వయస్సులో గుండెపోటు

తనకు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక రోజు తన ఎడమ చేతిలో మంట అనుభూతి చెందడం ప్రారంభించానని ఆ తర్వాత తాను స్వయంగా 911కి కాల్ చేసానని ఇవాన్ చెప్పాడు. అయితే ఈ సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చేసరికి ఇవాన్ ఒక్క అడుగు కూడా నడవలేక పారామెడికల్ సిబ్బంది చేతుల్లో పడ్డాడు. అతను శ్వాస తీసుకోవడం లేదు.. అయితే పారామెడిక్స్ బృందం అతనికి అంబులెన్స్ లోపల చికిత్స చేసింది. ఆ తర్వాత అతను మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. అయితే దీని తర్వాత మళ్లీ అతని శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇలా మొత్తం ఐదుసార్లు జరిగింది. అతను అంబులెన్స్‌లో చనిపోయాడు ..  మళ్లీ సజీవంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

రెండు నిమిషాల పాటు ఆగిన శ్వాస

అంబులెన్స్ ఇవాన్‌ని తీసుకుని ఆసుపత్రికి చేరుకున్నప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లే ముందు, అతని శ్వాస మళ్ళీ ఆగిపోయింది. ఇలా రెండుసార్లు జరిగింది. ఇవాన్ శ్వాస రెండు నిముషాల పాటు ఆగిపోవడం,  సాంకేతికంగా అతను ప్రతిసారీ 30-40 సెకన్ల పాటు చనిపోయిన స్థితిలోకి వెళ్లడం చూసి వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు కోమాలోకి వెళ్లడంతో ECMO మెషీన్‌లో ఉంచారు. అది అతని గుండె కొట్టుకోవడానికి సహాయపడింది. అప్పుడు ఇవాన్ శ్వాస సరిగ్గా పనిచేయడం మొదలైంది. తర్వాత ECMO యంత్రాన్ని తొలగించారు. అయితే అతను ఎక్కువ కాలం జీవించగలడని వైద్యులు భావించలేదు.

డాక్టర్లు కూడా నమ్మని నిజం

నివేదికల ప్రకారం ఇవాన్ బతికినా అతను నడవడానికి, మాట్లాడటానికి కనీసం రెండేళ్లు పడుతుందని వైద్యులు భావించారు. అయితే వైద్యులు కూడా నమ్మలేని విధంగా ఓ అద్భుతం జరిగింది. ఇవాన్ కేవలం ఒకటిన్నర రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు. నడవడం,మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోని జనరల్ వార్డులో ఉంచి డిశ్చార్జి చేశారు. ఇప్పుడు అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..