ట్రంప్‌ను కూడా తీసుకువస్తారేమో.. బీజేపీ నేతలపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంచి స్పీడుమీదున్న మంత్రి కేటీఆర్.. తన వాక్చాతుర్యంతో బీజేపీ నేతలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటీఆర్..

ట్రంప్‌ను కూడా తీసుకువస్తారేమో.. బీజేపీ నేతలపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్..
Follow us

|

Updated on: Nov 25, 2020 | 5:02 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మంచి స్పీడుమీదున్న మంత్రి కేటీఆర్.. తన వాక్చాతుర్యంతో బీజేపీ నేతలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటీఆర్.. తాజాగా మరో సెటైరికల్ బాంబ్ పేల్చారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ స్థాయి లీడర్లు మొదలుకొని, వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు రావడంపై తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ నుంచి ప్రచారం కోసం వస్తున్నారని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి నాయకులను కూడా ప్రచారానికి తీసుకువస్తారేమో అని పంచ్ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్నేహితుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి తీసుకు వస్తారేమో అని సైటెర్లు పేల్చారు. అయితే ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ప్రజల దీవెనలే తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, బీజేపీ నేతలు తమ ప్రచారంలో ఏనాడూ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎంతసేపూ మత విద్వేషాలు రెచ్చగొట్టడంపైనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉందని దుయ్యబట్టారు. ‘బీజేపీ నేతలు నోరు తెరిస్తే అక్బర్, బాబర్, బిన్ లాడెన్‌ పేర్లనే జపిస్తారు. పదే పదే వారి పేర్లను ఎందుకు జపిస్తారో అర్థం కాదు. వారేమైనా హైదరాబాద్ ఓటర్లా..?’ అని మంత్రి కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు