మట్టి దిబ్బలో దొరికిన చెక్కపెట్టె.. తెరిచి చూడగా ఊహించని నిధి..! సొంతం కావాలంటే మాత్రం..
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో రాళ్ల మధ్య వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. అతను మెటల్ డిటెక్టర్ నుండి ఒక శబ్దం వింటాడు. వెంటనే అక్కడ తవ్వాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ రాళ్ళు, మట్టిని తొలగించిన తర్వాత అతనికి ఒక చెక్క పెట్టె కనిపిస్తుంది.

పురావస్తు శాస్త్రవేత్తలు తరచూ ఏదో ఒక వింత, అరుదైన, అద్భుతాలను వెలికి తీస్తూనే ఉంటారు. అలా వారు కనిపెట్టిన కొత్త విషయాలను తరచూ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి కూడా పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే శతాబ్దాల క్రితం భూమిలో పాతిపెట్టిన అనేక వస్తువులు, విలువైన నిధి నిక్షేపాలను కూడా గుర్తించి వెలికితీస్తుంటారు. అందులో పనికి రాని వస్తువుల నుండి భారీ సంపద వరకు ప్రతిదీ ఉంటుంది. అయితే, తాజాగా ఒక మెటల్ డిటెక్టర్ భూమిలో పాతిపెట్టిన ఒక పెట్టెను గుర్తించింది. ఆ పెట్టెను ఓపెన్ చేసి చూడగా, దాని నుండి ఒక పాము బయటకు వచ్చింది. ఇంకా అందులో ఏముందో చూస్తే మీ కళ్లు బైర్లు కమ్మా్ల్సిందే..ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో రాళ్ల మధ్య వెతుకుతున్నట్లు కనిపిస్తుంది. అతను మెటల్ డిటెక్టర్ నుండి ఒక శబ్దం వింటాడు. వెంటనే అక్కడ తవ్వాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ రాళ్ళు, మట్టిని తొలగించిన తర్వాత అతనికి ఒక చెక్క పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె తెరవగానే, దానిలోంచి ఒక పాము బయటకు వస్తుంది. అది చాలా కోపంగా మీదకు దూకుతుంది.
ఇక అంతలోనే ఆ పెట్టె అడుగున చూస్తే..చాలా పెద్ద మొత్తంలో పాత నాణేలు కూడా కనిపిస్తున్నాయి. వీడియోలో, పాము కెమెరా వైపు బుసలు కొడుతూ కనిపిస్తుంది. ఆ పామును నిధిని కాపాడుతుందని అంటున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. భిన్నమైన కామెంట్లతో హోరెత్తించారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
@_.archaeologist అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఇలాంటి వీడియోలు ఇంతకు ముందు షేర్ చేయబడ్డాయి. వీటిలో చాలా వరకు AI వీడియోలు అంటున్నారు. కాగా, ఈ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు 15 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..