Andrea Ivanova: బాడి మాడిఫికేషన్‌ను కొనసాగిస్తున్న ఆ మహిళ.. ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు.. ఎవరో తెలుసా ఆమె..?
ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులు కలిగిన మహిళ ఆండ్రియా ఇవనోవా మరోసారి చర్చనీయాంశంగా మారింది..! బల్గేరియాకు చెందిన ఆండ్రియా తన అందంపై మరింతగా దృష్టిని సారించడానికి..
ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులు కలిగిన మహిళ ఆండ్రియా ఇవనోవా మరోసారి చర్చనీయాంశంగా మారింది..! బల్గేరియాకు చెందిన ఆండ్రియా తన అందంపై మరింతగా దృష్టిని సారించడానికి ప్లాన్ చేస్తున్నానని ఇటీవల తెలిపారు. అయితే ఈసారి ఆమె తన పెదవుల కోసం కాకుండా.. గడ్డం మీద తన దృష్టిని పెట్టింది. గత రెండు సంవత్సరాలలో దాదాపు 32 వేర్వేరు విధానాలను ప్రయత్నించానని వెల్లడించింది. ఆమె తన శారీరక రూపాన్ని మార్చుకోవడానికి , బ్రాట్జ్ బొమ్మలా కనిపించడానికి చాలా డబ్బులనే వెచ్చిస్తోంది.
ఆండ్రియా ఇవనోవా బాడీ మాడిఫికేషన్..
ఆండ్రియా ఇవనోవా ప్రపంచంలోనే అతిపెద్ద పెదవులు కలిగిన మహిళ అని అందరికీ తెలిసిన విషయమే. బల్గేరియా దేశానికి చెందిన ఈ మహిళ ప్రస్తుత వయసు 25 ఏళ్లు. బాడీ మోడిఫికేషన్ అనే జర్నీని 2018 సంవత్సరంలో ప్రారంభించిన ఆండ్రియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో.. “ఇది గత నెలలో నా పుట్టినరోజు నాటి ఫొటో. నేను జా ఫిల్లర్‌తో నా పుట్టినరోజును జరుపుకున్నాను. నేను ఇలా చేస్తున్నప్పటికీ నా పెదవులనుఇలాగే ఉంచుతాను’’ అని ఆమె పోస్ట్ చేశారు.
అంతేకాక అంతకముందు జరిగిన ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ..‘‘ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది మగవాళ్లు.. నా సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో నాకు డబ్బు పంపుతున్నారు. ఇంకా పర్యటనలకు, సమావేశాలకు నన్ను ఆహ్వానిస్తూ నాకు మెసేజ్‌లు పంపుతున్నార’ని ఆమె తెలిపింది.
ఆండ్రియా ఇవనోవాకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా..?
ఆండ్రియా ఇవనోవాకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ ఉంది. ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 24 వేల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 1934 పోస్ట్‌లను పెట్టారు.
కాగా, ఆండ్రియా ఇవనోవా తన చేస్తున్న బాడీ మాడిఫికేషన్ గురించి ఆమె ఫాలోవర్లు వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..