Viral Video: ఫుట్‌పాత్‌పై ఊహించని ప్రమాదం.. భారీ పేలుడుతో ఎగిసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో!
Viral Video: ప్రమాదం ఎప్పుడు.? ఎలా.? సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదొకటి జరగకమానదు. ఈ డైలాగులకు అడ్డం..
ప్రమాదం ఎప్పుడు.? ఎలా.? సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదొకటి జరగకమానదు. ఈ డైలాగులకు అడ్డం పట్టే విధంగా తాజాగా ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ సిటీలోని సెయింట్ అల్బన్స్ క్వీన్స్ అనే ప్రాంతంలో ఈ ప్రమాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ బిల్లును కట్టేందుకు సంబంధిత షాపుకు వెళ్లేటప్పుడు ఫుట్‌పాత్‌పై భారీ పేలుడు సంభవించింది. నివేదికల ప్రకారం ఈ పేలుడు ఘటన జూలై 22న జరిగినట్లు తెలుస్తోంది.
57 సంవత్సరాల బెర్రీ వెస్ట్ అనే వ్యక్తి తన ఫోన్ బిల్లును చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు పెద్ద శబ్దంతో కూడిన భారీ పేలుడు సంభవించింది. దురదృష్టవశాత్తు ఆ పేలుడులో బెర్రీకి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే స్థానికులు వేగంగా స్పందించడంతో అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బెర్రీ కోలుకుంటున్నాడని తెలిసింది. పేలుడు సంభవించక ముందు అక్కడ ఉన్న డ్రైనేజ్ హోల్స్‌లో ఒకదాని నుంచి పొగలు వస్తున్నట్లు మీరు గమనించవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇప్పటిదాకా 1.8 మిలియన్ వ్యూయర్స్ ఈ వీడియోను వీక్షించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్న అధికారి కాన్ ఎడిసన్ మాట్లాడుతూ.. ‘అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలు ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
This is nuts! A sidewalk explosion in St Albans, Queens. Thankfully, the brother is OK and recovering.
Reason no. 1 Billion why I fear walking over those grates. pic.twitter.com/C1tnFBNHdJ
— Jeff (@JeffJSays) July 27, 2021