Viral video: కళ్ళముందు సింహం.. కదిలితే ఇక అంతే.. అతను ఏంచేశాడంటే..
చాలా మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడుతూ ఉంటారు. ఎంతటి ప్రమాదకరమైన జంతువునైనా సరే ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రమాదం అని తెలిసి కూడా ఎంతో సాహసోపేతంగా వాటిని ఫోటోలు తీస్తూ ఉంటారు.

Viral video: చాలా మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడుతూ ఉంటారు. ఎంతటి ప్రమాదకరమైన జంతువునైనా సరే ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రమాదం అని తెలిసి కూడా ఎంతో సాహసోపేతంగా వాటిని ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇందుకోసం రోజులకొద్దీ అడవుల్లో గడుపుతూ ఉంటారు. అయితే వీరికి జంతువుల నుంచి వింత వింత అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సార్లు జంతువులు వీరిపై దాడి కూడా చేస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో మాత్రం వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. వైరల్ అవుతోన్న ఈ వీడియో ఓ సింహానికి సంబంధించింది.
ఈ వీడియోలో ఓ ఫోటోగ్రాఫర్ కారు ముందుభాగంలో కూర్చొని అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉన్నాడు ఇంతలో అతని పక్కనుంచి ఓ సింహం వచ్చింది. అతడినే అది కోపంగా చూస్తూ ఉండిపోయింది. అయితే అతడు సింహాన్ని గమనించలేదు. తీరా పక్కకు తిరిగి చూడగా సింహం అతడినే చూస్తూ ఉంది. అధిగమనించిన అతడు భయపడకుండా మెల్లగా అక్కడ్నుంచి వెళ్లినట్టు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవంతుడు అంటూ, మరికొందరు ఆ సింహం ఆకలితో లేదేమో అందికే బ్రతికిపోయాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.



View this post on Instagram
