Viral Video: పులితో ఆడుకుందామనుకున్నాడు కట్ చేస్తే.. కాకా గుండె జారి చేతులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ అవ్వాలి, అందరికంటే ఎక్కువగా లైక్‌లు రావాలి. రీల్స్‌తో రెచ్చి పోవాలి.. ఇటీవల చాలా మంది ఆలోచన ఇదే విధంగా ఉంటుంది. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా వైరల్ వీడియోలు చేయాలనుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి మరీ వీడియోలు..

సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ అవ్వాలి, అందరికంటే ఎక్కువగా లైక్‌లు రావాలి. రీల్స్‌తో రెచ్చి పోవాలి.. ఇటీవల చాలా మంది ఆలోచన ఇదే విధంగా ఉంటుంది. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా వైరల్ వీడియోలు చేయాలనుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి మరీ వీడియోలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మొదటికే మోసం వచ్చి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలకు సోషల్ మీడియాలో సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే జూపార్క్‌లో పులి ఉన్న బోన్ దగ్గరికి వెళ్లాడు. వెళ్లిన వాడు ఏదో పులి పక్కన నిల్చొని ఫొటో దిగాలా.. అలా చేయలేదు. పులితో ఆటలాడాలనుకున్నాడు. ఎలాగో పులి బోనులో ఉంది కదా.. ఏం చేయలేదు అన్న అతి నమ్మకంతో గ్రిల్ సందులో నుంచి పులిని తాకడం ప్రారంభించాడు. పులిని నెమిరాడు అంతటితో ఆగకుండా దాని చెవిని తాకాలని ప్రయత్నించాడు.




View this post on Instagram
ఈ క్రమంలో గ్రిల్ లోపల చేయి పెట్టి పులి చెవిని నెమిరాడు.. అయితే గ్రిల్ లోపలికి వెళ్లిన చేయి ఇరుక్కు పోయింది. అటు తిరిగి ఉన్న పులి తిరిగే చేయి దానికి ఆహారంగా మారిపోతుందని భయపడ్డాడు. అతి కష్టం మీదా చేతిని బోనులో నుంచి బయటకు తీశాడు. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో అతని ముఖంలో చావు భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేశాడు. గతేడాది డిసెంబర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చిచ్చాకు గుండె జారినంత పని అయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
