Viral Video: మొసలితో పరాచకాలు.. జస్ట్ మిస్.. లేదంటే క్షణాల్లో మాంసం ముద్ద అయ్యేవాడు
సోషల్ మీడియా అంటేనే రకరకాల వీడియోల సమాహారం. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియా అంటేనే రకరకాల వీడియోల సమాహారం. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మొసలికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మొసళ్లు చాలా డేంజరస్. చాలా తెలివైనవి కూడా. మాటు వేసి ఎలా వేటాడాలో వాటికి బాగా తెలుసు. నీటిలో ఉంటే మదపుటేనుగులనైనా మట్టుబెట్టగలిగే శక్తి వాటికి ఉంది. నీటిలో ఉంటే భారీ జంతువును సైతం వేటాడి కరకరా నమిలి మింగేస్తుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి మొసలితో పరాచకాలు ఆడాడు. దాని విజవల్స్ చిత్రీకరించేందుకు డేంజర్ జోన్‌లోకి వెళ్లాడు. భూమి మీద గడ్డి గింజలు ఉండి బ్రతికిపోయాడు కానీ.. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి…
View this post on Instagram
మొసలి విజువల్స్ చిత్రీకరించేందుకు ఓ వ్యక్తి కెమెరాతో కొలను దగ్గరకు వెళ్లాడు. దాన్ని బయటకు రప్పించేందుకు పరాచకాలు ఆడాడు. అయితే అది ఎంత ఆకలితో ఉందో.. బయటకే వచ్చిందే తడవు.. అతడిని చాలాదూరం వెంటాడింది. అతడు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది. దీంతో మొసలి తిరిగి కొలను లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను mattwright అనే వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ‘మొసలితో ఆటాడాలని చూస్తే వేటాడేస్తది’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘నీకు ఇది పునర్జమ్మే పో’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Also Read: Telangana: శివాలయంలో అద్భుతం… చేద బావి నుంచి సలసలా మరిగే వేడి నీళ్లు
బార్‌లో యాక్షన్ హీరో.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ‘స్వాతిముత్యం’లో కమల్ హాసన్