Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.! తాళం పోతే.? స్కూటీని ఇలాక్కూడా స్టార్ట్ చేయొచ్చా..

ప్రతీరోజూ లక్షల్లో వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక అనూహ్యంగా ఇంకొన్ని వీడియోలు అయితే.. ఓవర్‌నైట్‌లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తాయి. కొందరి క్రియేటివిటీని చూస్తుంటే.. ముచ్చటేస్తుంది.

Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.! తాళం పోతే.? స్కూటీని ఇలాక్కూడా స్టార్ట్ చేయొచ్చా..
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2024 | 1:55 PM

ప్రతీరోజూ లక్షల్లో వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక అనూహ్యంగా ఇంకొన్ని వీడియోలు అయితే.. ఓవర్‌నైట్‌లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తాయి. కొందరి క్రియేటివిటీని చూస్తుంటే.. ముచ్చటేస్తుంది. ఇలాంటివారు తమ ప్రతిభతో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆ కోవలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి హోండా యాక్టివాను స్టార్ట్ చేసేందుకు తాళం లేకపోయినా పర్లేదు.. ఇలా చేస్తే చాలు.. అని తన క్రియేటివిటీని చూపిస్తాడు. స్కూటీకి తాళం లేకపోయినా సరే.. ఇలా ఫింగర్ ప్రింట్‌తో స్టార్ట్ చేయొచ్చునని.. తన క్రియేటివిటీతో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశాడు. అతడు తన ఫింగర్‌తో ఆ సెన్సార్‌ను టచ్ చేస్తే.. ఠక్కున స్కూటీ ఇంజిన్ ఆన్ అవుతుంది. ఇక ఈ ట్రిక్ చాలామంది నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దెబ్బకు వీడియో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 33 లక్షలకు పైగా నెటిజన్లు చూశారు. అలాగే 75 వేలకు మందికి పైగా లైక్ చేశారు. ‘బ్యాటరీ అయితేపోతే ఎలా మరి’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘వర్షం దీని పరిస్థితి ఏంటి.?’ అని మరొకరు.. తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో హోరెత్తించారు.