AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓ వ్యక్తి, హైనాల మధ్య ప్రేమ చూడతరమా..! హైనా భార్య.. రెండు కోతులు నా పిల్లలంటున్న జంతు ప్రేమికుడు…

వైరల్ అవుతున్న వీడియోలో..  ఒక వ్యక్తి భయంకరమైన హైనాతో కూర్చున్నాడు. అంతే కాదు, హైనాను ఎంతో ప్రేమతో కౌగిలించుకున్న తర్వాత.. దానిని ముద్దు పెట్టుకున్నాడు.

Viral Video: ఓ వ్యక్తి, హైనాల మధ్య ప్రేమ చూడతరమా..! హైనా భార్య.. రెండు కోతులు నా పిల్లలంటున్న జంతు ప్రేమికుడు...
Hyna Lover Viral Video
Surya Kala
|

Updated on: Jul 06, 2022 | 2:42 PM

Share

Viral Video: అడవిలో నివసించే కౄర మృగాల్లో ఒకటి హైనా. ఇది చూడడానికి గండుపిల్లిలా కనిపిస్తుంది. అయితే వేటలో మంచి సామర్ధ్యం కలిగి ఉంటాయి. చనిపోయిన జంతువుల మాంసాన్ని ఎముకలతో సహా తిని జీర్ణం చేసుకోగలవు హైనాలు. అంతేకాదు తన ఎరను సజీవంగా తినేస్తాయి.  ఇతర జంవుతుల ఆహారాన్ని కూడా తింటూ ఎంతో ఆనందాన్ని పొందుతాయి. హైనాలకు సంబంధించిన అనేక రకల వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. అయితే ఈ హైనాలు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడవు.. బృందాలుగా జీవిస్తాయి. ఎంతో శక్తివంతమైన సింహం కూడా హైనాల గుంపుకు చిక్కితే.. వాటికీ ఆహారంగా మారాల్సిందే.  అయితే  తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో చూసిన తర్వాత షాక్ తింటారు. వాస్తవానికి, వీడియోలో.. ఒక వ్యక్తి హైనాను కుక్క పిల్లమాదిరి ముద్దుపెట్టుకున్నాడు. హైనా ఏమిటి.. మనిషి పెంపుడు జంతువులా ముద్దు పెట్టుకోవడం ఏమిటి అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

వైరల్ అవుతున్న వీడియోలో..  ఒక వ్యక్తి భయంకరమైన హైనాతో కూర్చున్నాడు. అంతే కాదు, హైనాను ఎంతో ప్రేమతో కౌగిలించుకున్న తర్వాత.. దానిని ముద్దు పెట్టుకున్నాడు. హైనా అతని ప్రేమకు ప్రతిస్పందిస్తూ మళ్ళీ ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, ఇలాంటి దృశ్యం చాలా అరుదుగా చూస్తాం.

ఇవి కూడా చదవండి

హైనా షాకింగ్ వీడియో యూట్యూబ్‌లో డీన్ ష్నీడర్ అనే ఛానెల్‌లో భాగస్వామ్యం చేయబడింది. ‘హైనా చాలా ప్రేమగా, సామాజికంగా, అందంగా, ముద్దుగా ఉంటుందని మీకు ముందే తెలుసా’ అనే క్యాప్షన్‌ ఈ వీడియోకి జతచేశారు. 28 ఏళ్ల స్విస్ డీన్ ష్నీడర్ తన జీవితాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం వెచ్చిస్తున్నాడని ఛానెల్ ప్రొఫైల్ వెల్లడించింది. అతను ఆఫ్రికాలో ఉన్నాడు. ఇప్పుడు సింహం తన కుటుంబంలో భాగమని అంటున్నాడు.  హైనా తన భార్య లాంటిదని.. తాను రెండు కోతులకు తండ్రి అని చెబుతున్నాడు డీన్ ష్నీడర్.

ఈ వీడియో 15 లక్షలకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత, ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తునే ఉన్నారు. నా పాదాలు వణుకుతున్నాయని ఒక వినియోగదారు చెప్పారు. అదే సమయంలో ఇది నిజంగా ఆశ్చర్యకరమైన వీడియో అని మరొక వినియోగదారు పేర్కొన్నాడు.  మొదటిసారిగా హైనా ప్రేమ ఈ వీడియోలో కనిపించింది. అతను హైనాను పక్కన పెట్టుకుని అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని ఆశ్చర్యంవ్యక్తం చేశారు కొందరు..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..