Trending : కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే.. కామ్‌గా ఉన్న మొసలిని కదిలించాడు చివరకు
అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసలి ఒకటి. మొసలి దగ్గరికి వెళ్లడం పక్కన పెడితే, దూరం నుంచి చూసినా భయమేస్తుంది. ఒక మొసలి నీటిలో సింహంతో పోటీపడగలదు.

కొంతమంది ప్రమాదమని తెలిసి కూడా కొన్నిసార్లు సాహసాలు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి కానీ ఇంకొన్నిసార్లు బెడిసి కొడతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసలి ఒకటి. మొసలి దగ్గరికి వెళ్లడం పక్కన పెడితే, దూరం నుంచి చూసినా భయమేస్తుంది. ఒక మొసలి నీటిలో సింహంతో పోటీపడగలదు. అదే నీటి బయటకు వస్తే మాత్రం అది అంతగా వేటాడాదు.
భారతదేశంలో మొసళ్ళు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో సంచరించవు. మానవ నివాసాలలో చాలా అరుదు. ప్రస్తుతం మొసలికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.




ఈ వీడియోలో ఒక భారీ మొసలి నది ఒడ్డున ఉంది. ఇంతలో ఒక వ్యక్తి దాని దగ్గరకు వెళ్లి పట్టుకోవాలని ప్రయత్నించాడు. మొసలి దగ్గరకు వెళ్లి దాన్ని తాకాలని ప్రయత్నించగా అది ఒక్కసారిగా అతడి పై దాడి చేసింది. మొసలి ఉన్నట్టుండి అతడి పైకి రావడం మనోడికి గుండెగినంత పనైంది. మొసలి వెనుక నుండి 3-4 సార్లు కదిలించినప్పుడు, మొసలి ఒక్కసారిగా కోపం తెచ్చుకుని అతనిపై దాడి చేస్తుంది. ఈ మొసలి ఎంత పెద్దదంటే అది ఆ వ్యక్తిని క్షణంలో మింగేసేది.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 28 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
