Viral: ఆత్రంగా ఐస్ బార్ కవర్ విప్పి.. నోట్లో పెట్టుకోబోయాడు.. వామ్మో…
ఎండాకాలం షురూ అయింది కదా..? అందరూ శీతల పానియాలు తెగ తాగేస్తున్నారు. ఇక ఐస్ క్రీం లవర్స్ గురించి చెప్పేది ఏముంది. సీజన్‌తో పని లేకుండా వారు లాగించేస్తూనే ఉంటారు. అయితే ఐస్ క్రీం లేదా ఐస్ బార్ కొనగానే ఆత్రంగా నోట్లో పెట్టుసుకోకండి.. ఒకసారి తేరా పారా చూసి తింటే బెటర్. ఎందుకంటే...?

మార్చి మొదలైంది ఎండలు ముదురుతున్నాయి. అందరూ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కొందరు వేసవి తాపం నుంచి బయటపడేందుకు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి లాగిస్తున్నారు. అలానే థాయిలాండ్ ఒక వ్యక్తి ఐస్ బార్ కొని తినేందుకు నోట్లో పెట్టుకుంటుండగా కనిపించింది చూసి కంగుతిన్నాడు. ఎందుకంటే ఆ ఐస్ బార్‌లో ఓ ప్రమాదకర పాము దర్శనమిచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి.. విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా ఆ పోస్ట్ తెగ వైరల్‌గా మారింది.
ముయాంగ్ రాట్చబురిలోని పాక్ థోకు చెందిన రేబాన్ నక్లెంగ్‌బూన్ అనే వ్యక్తి ఒక స్ట్రీట్ వెండర్ నుంచి ఐస్ బార్ కొన్నాడు. దాని కవర్ తీసేసి.. తినబోతుండగా కనిపించింది చూసి షాకయ్యాడు. ఎందుకంటే ఆ ఐస్ బార్‌పై నలుపు, పసుపు రంగులో ఉన్న పాము తల బయటకు కనిపించింది. పూర్తిగా పరిశీలించగా ప్రమాదకర చిన్నపాటి పాము అక్కడ ఉంది.
అతని పోస్ట్‌కు ఓ రేంజ్‌లో కామెంట్స్ వస్తున్నాయి. ‘వామ్మో బయట ఏం కొనాలన్నా భయం వేస్తుంది’ అని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ‘అది ఇంకా బతికే ఉంది అనుకుంట… ఆ ఐస్ కరిగిపోతే అది మిమల్ని కాటేయగలదు జాగ్రత్త’ అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ పెట్టాడు.
ఐస్ క్రీంలో కలవరపెట్టే పదార్థం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, ముంబైలోని ఓ డాక్టర్ తన సోదరి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బటర్‌స్కాచ్ కోన్‌ను కొరికగా… లోపల తెగిపోయిన మానవ వేలు ఉందని గ్రహించి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
