Watch Video: ఐడియా అదిరిపోయిందిగా..! మాజీ లవర్‌ని మర్చిపోవాలంటే ఇదే ఉత్తమ మార్గం..! వైరల్ అవుతున్న వీడియో..

Trending video: నచ్చిన అమ్మాయి దక్కక, లేదా ఆమెతో జరిగిన బ్రేక్ ఆప్‌తో.. చివరి వరకు ఆమె తలపులతోనే జీవించేవారు చాలా మంది ఉన్నారు. ఇక ఆ అమ్మాయిని మర్చిపోలేక చెడు వ్యసనాల బారిన పడ్డవారు కోకొల్లలు. అయితే వారందికి ఒక్కటే పరిష్కారం అంటూ ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైలర్ అవుతోంది. ఆ వీడియోను చూసిన వారు ఎవరైనా ‘వీడియోలో అతను చెప్పిన ఐడియా అద్దిరిపోయింది’ అని అనుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

Watch Video: ఐడియా అదిరిపోయిందిగా..! మాజీ లవర్‌ని మర్చిపోవాలంటే ఇదే ఉత్తమ మార్గం..! వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 13, 2023 | 5:56 PM

సమస్యలు లేని మానవుడు అంటూ ఈ భూ ప్రపంచంలో లేరు. ఒకరి ఆర్థిక ఇబ్బందులు, ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు, మరొకరికి వివాదాలు.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. కానీ అందరికీ ఎదురయ్యే సర్వసాధారణమైన సమస్య ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోవడం. నచ్చిన అమ్మాయి దక్కక, లేదా ఆమెతో జరిగిన బ్రేక్ ఆప్‌తో.. చివరి వరకు ఆమె తలపులతోనే జీవించేవారు చాలా మంది ఉన్నారు. ఇక ఆ అమ్మాయిని మర్చిపోలేక చెడు వ్యసనాల బారిన పడ్డవారు కోకొల్లలు. అయితే వారందికి ఒక్కటే పరిష్కారం అంటూ ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైలర్ అవుతోంది. ఆ వీడియోను చూసిన వారు ఎవరైనా ‘వీడియోలో అతను చెప్పిన ఐడియా అద్దిరిపోయింది’ అని అనుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

suribabu.lavangam_  అనే ఇన్‌స్టా మీమ్ పేజ్ హ్యాండిల్ నుంచి షేర్ అయిన ఈ వీడియోలో.. ఓ వ్యక్తి లవ్ బ్రేకప్, లవర్‌ని మర్చిపోవడానికి సలహా ఇచ్చాడు. అతన చెప్పిన మాటల ప్రకారం .. ఎవరైనా ఫ్రెండ్ 5 లక్షల రూపాయలను అప్పుగా అడిగితే ఇచ్చేయాలి. ఇలా అప్పులు తీసుకున్నవాళ్లు నెల, రెండు నెలల్లో ఇస్తా అంటారు కానీ ఇవ్వరన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మన ఆలోచనలన్నీ అప్పుగా ఇచ్చిన డబ్బుల మీదనే ఉంటుంది. అలాంటి సమయంలో లవర్ అనే మాట కూడా మదిలోకి రాదు. ఇలా ఆ వ్యక్తి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాత వీడియో. అయితే తాజాగా నెట్టింట షేర్ అయి మళ్లీ ట్రెండ్ అవుతోంది. 

ఇవి కూడా చదవండి

అయితే ఆ వ్యక్తి చెప్పిన ఐడియాను విన్న నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. లవర్ కోసం ఖర్చు చేసిన డబ్బులే ఎక్కువ, మళ్లీ ఇప్పుడు అప్పులు ఇచ్చి అప్పులపాలై పోవడం అవసరమా అని ఒకరు సరదాగా రాసుకొచ్చారు. ఇదే తరహాలో మరొకరు ‘లవర్ కంటే 5 లక్షలు ఎక్కువ అన్నమాట.. గ్రేట్ ఐడియా’ అని కామెంట్ చేశారు. అదే 5 లక్షలు ఉంటే ప్రేమించిన అమ్మాయి ఎందుకు వదిలేస్తది బ్రో అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మరో వైపు ఈ వీడియోకు వందలాది సంఖ్యలో లైకులు, లక్షలాది మొత్తంలో వీక్షణలు వస్తున్నాయి. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..