Viral: వావ్.. అద్భుతమైన ట్యాలెంట్ ఈయన సొంతం.. తల తిప్పకుండానే రెండు చేతులతో..!
Viral : కొంతమంది ఎడమచేతి వాటం ఉన్నవారు తమ ఎడమ చేతితో రాయడం వంటి పనులను చేస్తారు. అలాగే కుడిచేతి వాటం వారు కుడిచేతితో వ్రాస్తారు.
Viral : కొంతమంది ఎడమచేతి వాటం ఉన్నవారు తమ ఎడమ చేతితో రాయడం వంటి పనులను చేస్తారు. అలాగే కుడిచేతి వాటం వారు కుడిచేతితో వ్రాస్తారు. ఇది మామూలే. కానీ 3 ఇడియట్స్ సినిమాలో బోమన్ ఇరానీ రెండు చేతులతో రాసే పాత్రను చూశారుగా. అది చూసిన వారికి నిజ జీవితంలో ఇది సాధ్యమేనా అని ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు చేతులతో రాసే సామర్థ్యం ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాయడం వరకు ఓకే కానీ.. వెనుకకు తిరిగి, బోర్డు వైపు చూడకుండా ఒకేసారి రెండు చేతులతో డ్రాయింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .
ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన వీపును బోర్డుకి ఆనుకుని కుర్చీపై కూర్చుని రెండు చేతులతో శివాజీ, అతని ప్రత్యర్థి చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలు గీసేటప్పుడు ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా, తేలిగ్గా డ్రాయింగ్ గీయడం అద్భుతంగా పేర్కొనవచ్చు. హిందుస్థాన్ నౌ గ్లోబల్ ప్రెస్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దీనికి 1.5 మిలియన్ల వ్యూస్, 1.49 లక్షల లైక్‌లతో పాటు 2 వేలకు పైగా కామెంట్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతని ట్యాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..