AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బాబోయ్.. నాగిని డ్యాన్స్ చేయాలనుకుంటే.. నాగుపామే పూనింది.. నెటిజన్లను షేకాడిస్తున్న వీడియో..

నాగిన్ డ్యాన్స్.. ఈ నృత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పార్టీలు, పెళ్లిళ్లు లేదా ఏదైనా ఊరేగింపులో నాగిని డ్యాన్స్ లేకుండా అస్సలు మజానే ఉండదు.. చాలా మంది నాగిని డ్యాన్స్ మ్యూజిక్ రాగానే.. చేతులను అచ్చం నాగు పాము పడగలాగా మార్చి.

Watch Video: బాబోయ్.. నాగిని డ్యాన్స్ చేయాలనుకుంటే.. నాగుపామే పూనింది.. నెటిజన్లను షేకాడిస్తున్న వీడియో..
Nagin Dance Video
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2022 | 10:55 AM

Share

నాగిన్ డ్యాన్స్.. ఈ నృత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పార్టీలు, పెళ్లిళ్లు లేదా ఏదైనా ఊరేగింపులో నాగిని డ్యాన్స్ లేకుండా అస్సలు మజానే ఉండదు.. చాలా మంది నాగిని డ్యాన్స్ మ్యూజిక్ రాగానే.. తన చేతులను అచ్చం నాగు పాము పడగలాగా మార్చి.. కిర్రాక్ స్టెప్పులేస్తుంటారు. ఎన్ని పాటలు వస్తున్నా.. వారి కాళ్లు మాత్రం కదలవు.. ఒక్క నాగిని మ్యూజిక్‌తో.. కొంతమంది అసలు రూపం బయటకు వస్తుంది. నాగిన్ డ్యాన్స్‌కి చాలామంది భిన్నమైన క్రేజ్ కనిపిస్తుంది. ఇది తరచుగా పెళ్లిళ్లలో ఊరేగింపుల ద్వారా కనిపిస్తుంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిని చూసి నెటిజన్లు ఆనందించడంతోపాటు.. తెగ నవ్వుకుంటారు. తాజాగా.. ఓ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. అందులో నాగిన్ ట్యూన్ విన్న వెంటనే.. చాలా మంది తాచు పామును అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అచ్చం నాగు పాము పూనిన మాదిరిగా నృత్యం చేయడం ప్రారంభించాడు. ఇది చూసి నెటిజన్లు.. వామ్మో.. పాము అతని ఒంట్లోకి ప్రవేశించిందనుకుంటా.. అందుకే ఇలా చేస్తున్నాడంటూ ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఓ ఊరేగింపులో నాగిని నృత్యం చేస్తున్న వ్యక్తి.. ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పాము మాదిరిగా.. ఊరేగింపులో రచ్చ రచ్చ చేశాడు. ఆ వ్యక్తిని చూసి పక్కనే ఉన్న తన స్నేహితుడు బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.. కానీ అతను మాత్రం నియంత్రణ కోల్పోయి పాము లాగా నృత్యం చేస్తున్నాడు. నాగిన్ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి తాగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకేముంది.. లోపల కిక్కు.. బయటా కిక్కే.. నాగిని డ్యాన్స్ అంటే.. ఆ మాత్రం ఉంటుంది అన్నట్లు నాగిని డ్యాన్స్ చేశాడు. అచ్చం పాము మాదిరిగా ఒంపులు తిరుగుతూ.. చేతులను పడగ లాగా చేసి.. డ్యాన్స్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

నాగిన్ డ్యాన్స్ వీడియో..

ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో official_viralclips అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి లైక్ చేస్తున్నారు. ఈ పెళ్లి ఉరేగింపులో చాలా మంది సైతం డ్యాన్స్ చేస్తున్నారు. కానీ నాగిని డ్యాన్స్ మజా.. ఈ వ్యక్తితోనే వచ్చిందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..