Viral Video: ఇదెక్కడి రొమాన్స్‌రా బాబూ.. ప్రాణాలకు తెగించి మరీ.. నెటిజన్లు ఫైర్..
Viral Video: ప్రేమికులు, భార్యభర్తలు ఎవరి మధ్యైనా రొమాన్స్ అనేది నాలుగు గోడల మధ్య ఉంటేనే అందంగా ఉంటుంది. అదే బహిరంగా రెచ్చిపోతే దానిని బరిదెగింపు అంటారు. సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా వల్ల వచ్చిన పైత్యమో కానీ...
Viral Video: ప్రేమికులు, భార్యభర్తలు ఎవరి మధ్యైనా రొమాన్స్ అనేది నాలుగు గోడల మధ్య ఉంటేనే అందంగా ఉంటుంది. అదే బహిరంగా రెచ్చిపోతే దానిని బరిదెగింపు అంటారు. సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా వల్ల వచ్చిన పైత్యమో కానీ ఇటీవల జంటలు రెచ్చిపోతున్నారు. నలుగురి మధ్య ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారు. చాటుకు చేయాల్సిన రొమాన్స్‌ను కూడా బజారున పెట్టేస్తున్నారు. దీంతో వీరి రొమాన్స్‌ను ఎవరో ఒకరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవల బాగా హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంతకీ విషయమేంటంటే.. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట ప్రధాన రహదారిపై ఓ జంట బైక్‌పై వెళుతున్నారు. అయితే మాములుగా వెళితే అది వార్త అయ్యుండేది కాదు. యువతి పెట్రోల్ ట్యాంక్‌పై అబ్బాయికి ఎదురుగా కూర్చుంది. యువకు బైక్ నడిపిస్తుంటే అతడిని గట్టిగా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఓవైపు రొమాన్స్ కొనసాగిస్తూనే మరోవైపు బైక్‌ను డ్రైవ్ చేశాడా కుర్రాడు. ఎదురుగా వాహనాలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా రెచ్చిపోయారు. దీనంతటిని వెనకాల వస్తున్న మరో వాహనదారుడు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సదరు ప్రేమ జంటపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదెక్కడి రొమాన్స్‌రా బాబూ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కర్ణాటక మీడియా సంస్థలు కూడా వీరి వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Pawan Kalyan: ఏలూరు జిల్లలో పవన్ కళ్యాణ్.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం..