AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Message: దీపూ జీ నన్ను నీతో తీసుకుపో.. పెళ్ళికి సిద్ధంగా ఉన్న పుష్ప ఇచ్చిన సందేశం.. గమ్యం చేరేనా?

మీకు శివమణి సినిమా గుర్తుందా? నాగార్జున నటించిన సినిమా.. పోలీసాఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి.. లవర్ బాయ్ గా అదరగొట్టేస్తారు నాగార్జున అందులో.

Love Message: దీపూ జీ నన్ను నీతో తీసుకుపో.. పెళ్ళికి సిద్ధంగా ఉన్న పుష్ప ఇచ్చిన సందేశం.. గమ్యం చేరేనా?
Viral Note
KVD Varma
|

Updated on: Apr 25, 2021 | 8:25 PM

Share

Love Message: మీకు శివమణి సినిమా గుర్తుందా? నాగార్జున నటించిన సినిమా.. పోలీసాఫీసర్ గా ఎంట్రీ ఇచ్చి.. లవర్ బాయ్ గా అదరగొట్టేస్తారు నాగార్జున అందులో. అయితే, ఈ సినిమాలో ఒక సీన్ (సినిమాకి కీలకం కూడా అదే) చెప్పగలరా? తమ ప్రేమ గెలవాలని ఒక ప్రేమ సందేశాన్ని రాసి సీసాలో పెట్టి సముద్రంలో పాదేస్తుంది హీరోయిన్. అవును.. ఇప్పుడు గుర్తొచ్చిందా? చాలాకాలం అయిపొయింది కదా. మరి అటువంటిది నిజజీవితంలో జరుగుతుందా? అసలు సినిమాలు చూసి.. ఆ సీన్లు నిజ జీవితంలో జరుగుతాయా? నిజ జీవితంలోని అనుభవాలు సినిమాలుగా మన ముందుకు వస్తాయా? ఇది పెద్ద చర్చ లెండి.. ఇప్పుడు అది ఎందుకు గానీ, ఒక ప్రేమికురాలు తన పెళ్లి కుదిరిందనీ.. తనని తీసుకుపొమ్మనీ ప్రియుడిని కోరుతూ నోటు సందేశం పంపించింది. మీరు చదివింది కరెక్టే.. నోటు సందేశమే! ఆ కథేమిటో చూద్దాం రండి.

ప్రస్తుతం స్పీడ్ యుగంలో ఉన్నాం. అందరిదగ్గరా అరచేతిలో సమాచార వ్యవస్థ ఉంది. కానీ, ఒక్కోసారి అవి అక్కరకు రాకపోవచ్చు. వాటిని వాడే పరిస్థితీ ఉండకపోవచ్చు.. అటువంటి పరిస్థితుల్లో మరి సందేశం అవతలి వారికి చేరాలంటే? దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి? అందులోనూ ప్రేమకు సంబంధించిన విషయం అయితే, పాపం ఆ ప్రేమికురాలికి ఎటువంటి కష్టం వచ్చిందో. ఒక నోటుపై తన ప్రియుడికి సందేశాన్ని రాసింది. “ప్రియమైన దీపు గారు.. నాకు ఏప్రిల్ 26 న వివాహం జరగబోతోంది. నన్ను మీతో తీసుకెళ్లండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీ పుష్ప..” అంటూ రాసింది. ఇది ఎక్కడ రాసిందో.. రాసింది ఎవరో తెలీదు. కానీ ఈ సందేశం ఉన్న 20 రూపాయల నోటు మాత్రం ఇప్పుడు వైరల్ అయింది. మరి ఏప్రిల్ 26 దగ్గరకు వస్తుంటే.. ఈ నోటుసందేశం ఆ ప్రేమికుడి దగ్గరకు చేరుతుందా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ నోటు రాసిన పుష్ప ఎవరోగానీ, తనకు దీపు అనే వ్యక్తీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ సందేశంతో అర్ధం అవుతోంది అని నెటిజన్లు అంటున్నారు. ఈ నోటుసందేశం దీపూకు చేరితే బావుండునని కోరుకుంటున్నారు. వాళ్ళతో పాటూ మనమూ అదే కోరుకుందాం.

వైరల్ అవుతున్న ట్వీట్ ఇదే..

ఈ చిత్రాన్ని చూసిన తరువాత, ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఏప్రిల్ 26 న వివాహం చేసుకోబోతున్న పుష్పా అనే అమ్మాయి ఉంది, కాని ఆమె పెళ్లికి ముందే తన ప్రేమికుడు దీపు తొ కలిసి పారిపోవాలని కోరుకుంటుంది, కాబట్టి ఆమె నోట్ మీద రాయడం ద్వారా తన ప్రేమను చెప్పడానికి ప్రయత్నించింది. ఈ ప్రేమ సందేశం యొక్క వాస్తవికత ఏమిటో ఇప్పుడు ఎవరికీ తెలియదు. కాని, ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో 20 రూపాయల నోటు.. దానిపై వ్రాసిన ఈ సందేశం ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.

అయితే, కొన్ని రోజుల క్రితం ఇలానే..’సోనమ్ గుప్తా బేవాఫా హై’ అని రాసి ఉన్న పదిరూపాయల నోటు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీని గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

Also Read: కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు రెమ్ డెసివిర్ వాడడం మంచిది కాదు, ఎయిమ్స్ డైరెక్టర్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లింపును ఆపండి, ప్రధానికి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ