Viral: సముద్ర గర్భంలో బయటపడ్డ 300 ఏళ్ల నాటి నిధి.. విలువ తెలిస్తే బైర్లు కమ్మాల్సిందే
సాగర గర్భంలో స్వర్ణ నౌక.. ఎస్ 310 ఏళ్లక్రితం మునిగిన నౌక అవశేషాల్లో కళ్లు చెదిరే నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. ఇంతకీ ఎక్కడ బయటపడింది స్వర్ణనౌక. ఈ నౌక విశేషాలేంటి చూద్దాం. ఆ వివరాలు కోసం ఈ వార్తపై ఓ లుక్కేయండి మరి.

నీటిపాలైన నిధినిక్షేపాల కోసం అట్లాంటిక్ సముద్రంలో ట్రెజర్ హంటర్స్ సాగించిన అన్వేషణకు ఫలితం దక్కింది. శతాబ్దాల క్రితం మునిగిపోయి సముద్ర గర్భంలో ఉన్న నౌకలో నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. భారీగా బంగారం, వెండి నిక్షేపాలను తరలిస్తుండగా 1715 జూలై 31న భారీ తుఫాన్ కారణంగా స్పెయిన్‌కి వెళ్తున్న నౌక మునిగిపోయింది. ఫ్లోరిడా ట్రెజర్ కోస్ట్‌లో 310 ఏళ్ల క్రితం జరిగిన ఘటనని అంతా ఎప్పుడో మరిచిపోయారు. కానీ.. పట్టువదలని విక్రమార్కుల్లా కొందరు సముద్రాన్ని జల్లెడపడుతూనే ఉన్నారు. చివరికి వెయ్యి వెండి నాణేలు, ఐదు బంగారు నాణేలను సాగరగర్భం నుంచి బయటికి తీయగలిగారు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
సాగరగర్భం నుంచి బయటపడ్డ నాణేల విలువ మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 8 కోట్ల రూపాయల పైనే. సముద్రంలో శోధించి సాధించిన నాణేలను అప్పట్లో మెక్సికో, పెరు, బొలీవియాలో ముద్రించినట్లు గుర్తించారు. మూడున్నర దశాబ్దాలుగా సాగుతున్న నిధి నిక్షేపాల వేటలో ఇదే అతిపెద్ద ట్రెజర్ రికవరీగా చెబుతున్నారు నిపుణులు. అప్పట్లో నౌకమునిగిన ఘటనలో వెయ్యిమందిదాకా ప్రాణాలు కోల్పోయారు. అపారమైన నిధి నిక్షేపాలు ఉండటంతో 18వ శతాబ్దంలో ఎలాగోలా కొంత నిధిని తిరిగి కనిపెట్టగలిగినా.. మిగతాదంతా శతాబ్ధాలుగా సాగరగర్భంలోనే ఉండిపోయింది. ఇన్నేళ్లకి గోల్డ్, సిల్వర్ కాయిన్స్ దొరకటంతో.. ఆ ట్రెజర్ షిప్ అవశేషాల కోసం మరింత ఉధృతంగా సాగర మథనం జరగబోతోంది. ప్రస్తుతానికి దొరికింది కొంతే.. కానీ సముద్రగర్భంలో కొండంత నిధి ఉంది.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్




