AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Long Hair Tale: లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న పొడవైన జుట్టు.. వీడియో వైరల్..

Long Hair Tale: లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా 2020-2022 ఏడాదికి గాను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది..

Long Hair Tale: లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న పొడవైన జుట్టు.. వీడియో వైరల్..
Long Hair Tale
Surya Kala
|

Updated on: Oct 09, 2021 | 7:28 PM

Share

Long Hair Tale: లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా 2020-2022 ఏడాదికి గాను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది ఆకాంక్ష యాదవ్.  ఇప్పటికే పలు మార్లు  అనేక రికార్డ్స్ ను సొంతం చేసుకుంది మహారాష్ట్రలోని థానేకి చెందిన ఆకాంక్ష యాదవ్. తన జుట్టుతో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆకాంక్ష యాదవ్ మన దేశంలో అతి పొడవైన జుట్టు ఉన్న అమ్మాయిగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఆకాంక్ష యాదవ్ జుట్టు 9 అడుగుల 10.5 అంగుళాలు (3.01 మీటర్లు) పొడవాటి జుట్టుతో అద్భుతంగా ఉంటుంది. ఈ యువత జుట్టు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రశంసలను తెచ్చిపెట్టింది. అంతేకాదు తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కేలా చేసింది.

ఆకాంక్ష 2019 నుండి పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా ఖ్యాతిగాంచింది. ఫార్మాస్యూటికల్ , మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ అయిన ఆకాంక్ష తన జుట్టు తనకు దేవుడిచ్చిన వరమని భావిస్తుంది. తన జుట్టు తెస్తున్న రికార్డులు చాలా గొప్పవని. అయితే దీనికి కారణమైన తన పొడవైన జుట్టుని కాపాడుకోవడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పింది. ఇక తన జుట్టుని వాష్ చేసుకోవడానికి రోజులో 20 నిముషాలు వెచ్చిస్తానని ఆకాంక్ష చెప్పింది. తన పొడవాటి జుట్టును కత్తిరించడం గురించి కూడా మాట్లాడుతూ.. నేల పొడవును మించి నడుము దిగువకు కత్తిరించినట్లు  చెప్పింది.

Also Read:  భక్తులకు కనువిందు చేసిన శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. తామరపువ్వులు మండపం