వామ్మో.. పిల్లా కాదు బాబోయ్ చిచ్చర పిడుగు.. భారీ విష సర్పాన్ని బొద్దింకలా తరిమికొట్టింది..!
పాములంటే చాలా మందికి భయం. ఎందుకంటే..పాము విషపూరితమైన జీవి. పాముకాటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పాములు కనిపిస్తే చాలా మంది భయపడతారు. పాముకు దూరంగా పారిపోతారు. అలాంటి పాము ఇంట్లో కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా..? పాము కాటువేయకుండానే ప్రాణం పోయినంత పనవుతుంది. కానీ, ఇక్కడ ఒక చిన్నారి మాత్రం భారీ విషసర్పాన్ని అదేదో ఎలుక, పిల్లిని, బొద్దింకను తరిమికొట్టినంత ఈజీగా ఇంట్లోంచి బయటకు గెంటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఆస్ట్రేలియాకు చెందినదిగా తెలిసింది. వీడియోలో ఒక చిన్న అమ్మాయి తన ఇంట్లో ప్రమాదకరమైన పామును చూసింది. కానీ, ఆమె భయపడలేదు. ఎటువంటి భయం లేకుండా ఆ చిన్నారి పామును తరిమికొట్టింది. ఆ అమ్మాయి ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
వైరల్ వీడియో ప్రారంభంలో ఆ అమ్మాయి మొదట తన తండ్రికి ఇంట్లో దాగి ఉన్న పాము గురించి చెబుతుంది. ఆ తర్వాత, ఆమె ఆ పాము నక్కివున్న ప్రదేశానికి తీసుకువెళుతుంది. ఆ వ్యక్తి పామును చూసిన తర్వాత కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఆ తరువాత ఆ అమ్మాయిని దానిని ఇంటి నుండి బయటకు విసిరేయమని చెప్పటం కూడా వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు ఏం జరిగింది.
ఆ అమ్మాయి వెంటనే ఇంటిని తుడిచే మాప్ ని తీసుకుంటుంది. ఆపై తన తండ్రి సూచనల మేరకు ఆమె ఆ ప్రమాదకరమైన పామును మాప్ తో తరుముతూ ఇంటి నుండి వెళ్ళగొడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఆ అమ్మాయి ముఖంలో ఏమాత్రం భయం లేదు. వీడియోలో ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల ప్రశాంతమైన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే, తరువాత తల్లి తిరిగి వచ్చినప్పుడు ఇంటి నుండి పాము బయటకు రావడాన్ని చూసి ఆమె అస్సలు భయపడదు. ఏమీ జరగనట్లుగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియో చూస్తుంటే, ఆస్ట్రేలియాలో ఇళ్లలోకి పాములు ప్రవేశించడం సర్వసాధారణం అనిపిస్తుంది. @mattwright అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని షేర్ చేశారు. దీనిని 60 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై ప్రజలు భారీగా వ్యాఖ్యానిస్తున్నారు.




