Viral Video: సింహాల అడవిలో సఫారికి వెళ్లారు.. చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చింది.. షాకింగ్ వీడియో..
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. చిన్న పొరపాటు చూస్తుండగానే రెప్పపాటులో ఒకరి ప్రాణాల మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
అడవిలో సఫారీ అంటే కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. అడవిలో ఉండే క్రూరమృగాలను మరింత దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఈ జంగిల్ సఫారీ అనుభవం.. అద్భుతమైన పర్యావరణాన్ని చూసామనే భావన చాలా ప్రత్యేకం. ఇలాంటి జంగిల్ సఫారి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. చిన్న పొరపాటు చూస్తుండగానే రెప్పపాటులో ఒకరి ప్రాణాల మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆ వీడియోలో కొంతమంది తమ కారులో జంగిల్ సఫారీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సింహాల గుంపు ఉన్న వద్ద కారు ఆపి.. వాటిని చూస్తున్నారు. అయితే తమ కారు డోర్ లోపలి నుంచి మర్చిపోయారు. కారు లోపలే ఉండి సింహాలను వీడియోస్ తీస్తుండగా.. ఆకస్మాత్తుగా వచ్చిన ఓ సింహం నోటితో కారు డోర్ ఓపెన్ చేసింది. దీంతో వారి చిన్న పొరపాటు ప్రాణాల మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Safari is over ?? pic.twitter.com/oYElejL0Z2
— Tansu YEĞEN (@TansuYegen) September 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.