అరెరే.. పూలకుండి దొంగిలించాలనుకుంది.. కట్ చేస్తే.. సీన్‌ అదిరింది..

అరెరే.. పూలకుండి దొంగిలించాలనుకుంది.. కట్ చేస్తే.. సీన్‌ అదిరింది..

Phani CH

|

Updated on: Sep 19, 2022 | 8:58 PM

మీరు రకరకాల దొంగలను చూసి ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను ఎప్పుడూ చూసి ఉండరు. ఎవరైనా డబ్బులో, నగలో లేక ఏదైనా వస్తువులో దొంగతనం చేస్తారు.

మీరు రకరకాల దొంగలను చూసి ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను ఎప్పుడూ చూసి ఉండరు. ఎవరైనా డబ్బులో, నగలో లేక ఏదైనా వస్తువులో దొంగతనం చేస్తారు. కానీ ఓ యువతి చేసిన దొంగతనం చూస్తే.. వామ్మో ఇలాంటి దొంగలు కూడా ఉన్నారా అనుకుంటారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి వేగంగా స్కూటీపైన దూసుకు పోతోంది. ఈ క్రమంలో ఓ చోట రోడ్డు పక్కన అందానికి అలంకారంగా పెట్టిన పూల కుండీలు కనిపించాయి. ఆ అందులో ఓ చిన్న తెల్లని పూలకుండీపై ఆమె దృష్టిపడింది. దానిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలనుకుంది. అటూ ఇటూ చూసింది తనను ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్న తర్వాత స్కూటీ పైనుంచే ఆ కుండీని అందుకోడానికి ప్రయత్నించింది. కానీ, పాపం ప్రయత్నం బెడిసికొట్టింది.. దెబ్బకు స్కూటీతో సహా గింగిరాలు తిరిగిపోయింది. చిన్న దొంగతనం ఆమె ప్రాణాల మీదకే తెచ్చింది. యువతి బైక్‌ బ్యాలెన్స్ తప్పి… ముందుకు దూసుకెళ్లింది. స్కూటీని అదుపుచేయలేకపోయింది దాంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో అద్భుతం.. రంగు రంగుల లైట్లతో దూసుకెళ్లిన ట్రైన్ !!

చెట్టుపై నల్లటి ఆకారం.. దెబ్బకు బెదిరిపోయిన కుక్కలు.. సీన్ కట్ చేస్తే !!

Viral Video: కుక్కపిల్లను నేలకేసి బాదిన మహిళ.. వీడియో వైరల్

పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!

Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!

 

Published on: Sep 19, 2022 08:58 PM