పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!

పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!

Phani CH

|

Updated on: Sep 19, 2022 | 8:47 PM

జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. చిన్న చిన్న కష్టాల గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే..

జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. చిన్న చిన్న కష్టాల గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే.. తమపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించేందుకు ఎండ, వాన అనేది తేడా లేకుండా ఇబ్బందులు పడుతూ బ్రతుకు జట్కా బండిని నడిపేవారు మరికొందరు. ఇక పేదవారి గురించయితే చెప్పనక్కర్లేదు.. ఒక పూట అన్నం కోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.. అలా వచ్చిన ఫుడ్.. ఒకవేళ వారికి నోటి దాకా అందకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూశాక మీ గుండె బరువెక్కడం ఖాయం. పైనుంచి కుండబోత వర్షం కురుస్తోంది.. అంత వర్షంలోనూ ఓ వ్యక్తి ఓ స్కూటర్‌ కింద భోజనం పెట్టుకుని తడుస్తూ భోజనం చేస్తున్నాడు. వర్షంలో తడుస్తున్నా.. అతడు పట్టించుకోవట్లేదు.. కానీ అతడికి దొరికిన ఆహారాన్ని మాత్రం వర్షం నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాగా ఆకలితో ఉన్న అతడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి పట్టించుకోకుండా.. తన కడుపు నింపుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోను చూశాక నెటిజన్లు బరువెక్కిన హృదయాలతో కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదొక తమాషా ప్రపంచం.. కొందరికి ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు ఆహారం రుచిగా లేదని పడేస్తున్నారు. ‘జీవితంలో మీకు లభించిన ప్రతీదానికి కృతజ్ఞతతో ఉండాలి’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!

దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!

Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్‌ కోసం ఫారెన్‌కు !!

కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే పాప !!

TOP 9 ET News: జపాన్‌లో సెన్సేషన్‌గా. చెర్రీ, తారక్‌ |NTR ఫ్యాన్స్‌తో పెట్టుకున్న హీరోయిన్

 

Published on: Sep 19, 2022 08:47 PM