కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే  పాప !!

కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే పాప !!

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2022 | 4:50 PM

అవడానికి శ్రీలంకనే అయినా.. బాలీవుడ్ లో స్టార్ గా సెటిల్‌ అయ్యారు జాక్వెలిన్. సెటిల్ అవ్వడమే కాదు.. నాలుగు సినిమాలు ఆరు పాటలంటూ.. ఫుల్ బిజీగా మారిపోయారు.

అవడానికి శ్రీలంకనే అయినా.. బాలీవుడ్ లో స్టార్ గా సెటిల్‌ అయ్యారు జాక్వెలిన్. సెటిల్ అవ్వడమే కాదు.. నాలుగు సినిమాలు ఆరు పాటలంటూ.. ఫుల్ బిజీగా మారిపోయారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. రీసెంట్గా తను చేసుకునే వాన్ని కూడా చూజ్‌ చేసుకుని తన ఫ్రెండ్స్కు పరిచయం చేశారు. అలా చేసుకునే వాడు.. తనకు క్లాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తుంటే తెగ మురిసిపోయారు. అతని ప్రేమలో తేలిపోయారు. కాని కట్‌ చేస్తే.. ఇప్పుడు తల పట్టుకుని కూర్చున్నారు. ఢిల్లీ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ కోట్ల రూపాయల విలువైన బహుమతులు తీసుకున్నట్టు అభియోగాలు ఇటీవల నమోదయ్యాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో పాటు ఢిల్లీ పోలీసుల ఆర్ధిక విభాగం కూడా చాలా గంటల పాటు జాక్వెలిన్‌ను విచారించింది. ఖరీదైన కార్లతో పాటు విలువైన నగలను సుకేశ్ నుంచి బహుమతిగా పొందినట్టు నిర్థారించుకుంది. అంతే కాదు.. కోట్లలో నగదు కూడా జాక్వెలిన్ కు తరుచుగా ఇచ్చేవాడని ఋజువులు సంపాందించింది ఈడీ. దీంతో ఈ బ్యూటీ కూడా.. తన బాయ్‌ ఫ్రెండ్ సుకుశ్‌ లాగే.. తీహార్ జైళుకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Digital News Round Up: ఓకే ఫ్రేములో బాలయ్య, పవన్‌ | దసరా బరిలో చిరు, నాగ్‌ ..లైవ్ వీడియో

Published on: Sep 19, 2022 06:51 PM