చెట్టుపై నల్లటి ఆకారం.. దెబ్బకు బెదిరిపోయిన కుక్కలు.. సీన్ కట్ చేస్తే !!
అర్ధరాత్రి వేళ చెట్టు కింద నిద్రపోతున్న రెండు వీధి కుక్కలకు చెట్టుపైన ఏదో అలికిడి వినిపించింది. ఏంటా అని చూడగా.. వాటికి చెట్టుపై మెరిసే కళ్లతో ఓ నల్లటి ఆకారం కనిపించింది. దాన్ని చూసి మొరగడం ప్రారంభించాయి.
అర్ధరాత్రి వేళ చెట్టు కింద నిద్రపోతున్న రెండు వీధి కుక్కలకు చెట్టుపైన ఏదో అలికిడి వినిపించింది. ఏంటా అని చూడగా.. వాటికి చెట్టుపై మెరిసే కళ్లతో ఓ నల్లటి ఆకారం కనిపించింది. దాన్ని చూసి మొరగడం ప్రారంభించాయి. అంతే!.. ఆ ఆకారం ఒక్క ఉదుటున చెట్టుపై నుంచి కిందకు దూసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న ఈ వీడియోలోల చీకట్లో చెట్టుపై కనిపించిన ఓ నల్లటి ఆకారాన్ని చూసి రెండు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. ఇంతకీ ఆ చెట్టుపైన ఉన్న ఆ ఆకారం ఏంటనేగా మీ అనుమానం.. ఇంకేంటి.. చిరుతపులి. ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతపులి.. ఎంచక్కా చెట్టు ఎక్కి కూర్చుంది. ఇక ఈ రెండు కుక్కలు దాన్ని చూసి మొరగడం మొదలుపెట్టాయి. క్రూర జంతువు ఊరుకుంటుందా.? వాటి పని పడదామని కిందకు దూకింది. అంతవరకూ ధైర్యంగా చిరుతపులిపై అరిచిన ఈ రెండు కుక్కలు.. తోకముడుచుకుని చెరోవైపూ పరుగులు తీశాయి. బహుశా చిరుతకు వేటాడే మూడ్ లేనట్లు ఉంది. ఆ రెండింటిని చంపకుండా వదిలిపెట్టడమే కాకుండా.. అక్కడ నుంచి పారిపోయింది. ఈ ఘటన పూణే నగర శివార్లలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కుక్కపిల్లను నేలకేసి బాదిన మహిళ.. వీడియో వైరల్
పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!
Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!
దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!
Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్ కోసం ఫారెన్‌కు !!