Video Viral: ఇలాంటి వీడియోను మీరెన్నడూ చూసుండరు.. జీవనం కోసం అనుక్షణం పోరాటం చేయాల్సిందే..
అడవుల్లో (Forest) ఎన్నో రకాల జంతువులు నివాముంటాయి. వాటిలో క్రూర జంతువులు కూడా ఉన్నాయి. పులి, సింహం, ఎలుగుబంట్లు వంటివి ప్రమాదకరమైనవి. అవి తోటి జీవులతో పాటు మనుషులకూ హాని కలిగిస్తాయి. కొన్ని సార్లు...
అడవుల్లో (Forest) ఎన్నో రకాల జంతువులు నివాముంటాయి. వాటిలో క్రూర జంతువులు కూడా ఉన్నాయి. పులి, సింహం, ఎలుగుబంట్లు వంటివి ప్రమాదకరమైనవి. అవి తోటి జీవులతో పాటు మనుషులకూ హాని కలిగిస్తాయి. కొన్ని సార్లు ప్రాణాలే తీస్తాయి. మనుగడ సాగించేందుకు అవి నిత్యం పోరాడాల్సి ఉంటుంది. సాధారణంగా పెద్ద జంతువులు చిన్న జంతువులను వేటాడతాయి (Hunting). అయితే క్రూర జంతువులు తగాదా పడటం మీరెప్పుడైనా చూశారా. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. వాటి పోరాటాలు చాలా ప్రమాదకరంగా, భయంకరంగా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ (Viral) అవుతోంది. ఈ క్లిప్ లో రెండు సింహాలు చిరుత పులిపై దాడి చేస్తాయి. అవి మూకుమ్మడిగా ఎట్టాక్ చేస్తుండటంతో చిరుత విలవిల్లాడిపోయింది. ప్రమాదం నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. అయితే.. చిరుతపులి అంటేనే చురుకుదనానికి మారుపేరు. వేగంగా పరిగెత్తడంతో దీనిని మించింది మరొకటి లేదు. అలాంటి చిరుత సింహాల చేతికి చిక్కడం, వాటి తో గొడవ పడటం ఆసక్తికరంగా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయింది. చిరుత, సింహం పోరాట దృశ్యాలు చూశాక నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీడియో చూసి లైక్ చేస్తున్నారు. వ్యూస్ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇలాంటి పోరాటాలు చాలా అరుదుగా కనిపిస్తాయని, అడవిలో జీవించాలంటే అనుక్షణం పోరాటం చేయాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..