AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తొలిసారి అద్దంలో తనను తాను చూసుకున్న చిరుత.. రియాక్షన్‌ చూడాల్సిందే..!

చిరుతపులికి వేగం, కోతిలా చురుకుదనం, సింహంలా ధైర్యం ఎక్కువని చెబుతారు.. కానీ ఇక్కడ మనం చిరుతపులి వేట గురించి కాదు, దాని ప్రత్యేకమైన ప్రవర్తనకు సంబంధించి అరుదైన దృశ్యాన్ని చూడబోతున్నాం. చిరుతపులి తనను తాను అద్దంలో చూసుకోవడంతో షాక్‌కు గురై గ్లాస్‌పైనే దాడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో..ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Viral Video: తొలిసారి అద్దంలో తనను తాను చూసుకున్న చిరుత.. రియాక్షన్‌ చూడాల్సిందే..!
Leopard
Jyothi Gadda
|

Updated on: Jun 21, 2024 | 4:37 PM

Share

సోషల్ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో కొంతమంది జంతువుల వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు జంతువులకు సంబంధించిన అనేక మంచి మంచి వీడియోలు వెలుగులోకి వస్తుంటాయి. కొన్నిసార్లు జంతువుల దాడికి సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. ఇప్పటి వరకు మీరు అనేక వైల్డ్‌లైఫ్ వీడియోలను చూసి ఉంటారు. అయితే మీరు ఇంతకు ముందెన్నడూ చూడని ఫారెస్ట్ వీడియోని ఈ రోజు మేము మీకు చూపించబోతున్నాము. అలాంటిదే ఇక్కడ ఒక చిరుతపులి వీడియో కనిపించింది. చిరుతపులి అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా పిలుస్తారు. అది దట్టమైన పొద అయినా, చీకటి అయినా, చిరుతపులి గురిపెట్టిన ఎరను బాగా వేటాడగలదు. చిరుతపులికి వేగం, కోతిలా చురుకుదనం, సింహంలా ధైర్యం ఎక్కువని చెబుతారు.. కానీ ఇక్కడ మనం చిరుతపులి వేట గురించి కాదు, దాని ప్రత్యేకమైన ప్రవర్తనకు సంబంధించి అరుదైన దృశ్యాన్ని చూడబోతున్నాం. చిరుతపులి తనను తాను అద్దంలో చూసుకోవడంతో షాక్‌కు గురై గ్లాస్‌పైనే దాడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో..ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

జంతువుల పరీక్షలో భాగంగా అడవిలో ఒక పెద్ద అద్దం ఏర్పాటు చేశారు ఫారెస్ట్‌ అధికారులు. ఒక చిరుతపులి అద్దం గుండా వెళుతుంది. అప్పుడు దాని దృష్టి అద్దం వైపు వెళుతుంది. అద్దంలో తనను తాను చూసుకున్న చిరుతపులి ఒక్కసారిగా షాక్‌ అవుతుంది. ఆ వెంటనే అద్దంలో కనిపిస్తున్న దాని ప్రతిబింబంపై దాడికి దిగుతుంది. కానీ గ్లాసులో దాని ప్రతిబింబం కూడా దాడి చేస్తున్నట్టుగా కదులుతూ చిరుతను కలవరపెడుతుంది. అలా ఆ చిరుత కొన్ని సెకన్ల పాటు నిశ్చలంగా ఉండిపోతుంది.. ఎదురుగా ఉన్న అద్దంలో మరో జీవి ఉందని భావించి మళ్లీ గ్లాసులో ఉన్న తన బొమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించి భయపడిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ‘X’ (గతంలో ట్విట్టర్)లో ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ (@AMAZlNGNATURE) హ్యాండిల్‌తో షేర్‌ చేయబడింది. ఈ పేజీ వన్యప్రాణుల వీడియోలను షేర్ చేస్తుంది. ఇటీవల, చిరుతపులి మొదటిసారిగా అద్దంలో చూసుకున్న దృశ్యం వీడియోను ఈ పేజీలో పంచుకున్నారు. దానికి క్యాప్షన్‌గా “చిరుతపులి అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు దాని రియాక్షన్‌” అని రాసిఉంది.

చిరుతపులి వింత చేష్టలను ప్రజలు బాగా ఇష్టపడ్డారు. కేవలం 15 సెకన్ల క్లిప్‌ను ఇప్పటివరకు 8.70 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. 18 వేల మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. కామెంట్స్‌లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు, ‘చిరుత తనపై తాను దాడి చేసుకుంటూ భయపడిపోయిన దృశ్యం అందంగా ఉందని రాశారు. ఇలా చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..