Viral Video: అయ్యో.! చిరుతకు చిక్కిన జింకపిల్ల.. తల్లడిల్లిన తల్లి జింక.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

అడవిలో క్రూర జంతువుల వేట సర్వసాధారణం. అక్కడ చట్టాలు అలా ఉంటాయి. సింహం, పులి, చిరుత లాంటి జంతువులు తమకు నచ్చిన..

Viral Video: అయ్యో.! చిరుతకు చిక్కిన జింకపిల్ల.. తల్లడిల్లిన తల్లి జింక.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2021 | 3:53 PM

అడవిలో క్రూర జంతువుల వేట సర్వసాధారణం. అక్కడ చట్టాలు అలా ఉంటాయి. సింహం, పులి, చిరుత లాంటి జంతువులు తమకు నచ్చిన జంతువులను పరిగెత్తించి మరీ వేటాడతాయి. ఏది ఏమైనా అడవిలో జీవన మనుగడ సాగించాలంటే.. వ్యూహం, వేగమైనా ఉండాలి.. లేదంటే తప్పించుకునే చాతుర్యమైనా కలిగి ఉండాలి.

చిరుత వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి అద్భుతమైన వేటగాళ్లు. తన ఎర కనుచూపు మేర నుంచి తప్పించుకోకుండా వ్యూహాన్ని రచించి వాయువేగంతో వేటాడుతుంది. సాధారణంగా చిరుతలు జింకలను వేటాడతాయి. వాటికి జింక మాంసం అంటే మహా ఇష్టం. తాజాగా ఓ జింక పిల్లను చిరుత వేటాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. తల్లిప్రేమకు అద్దంపట్టే విధంగా ఎన్నో వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మనుషుల్లోనైనా, జంతువులలో అయినా తల్లిప్రేమ ఒకేలా ఉంటుంది. ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ తల్లి తన బిడ్డను సంరక్షిస్తుంది. ఇదే కోవకు చెందిన ఈ వీడియోను చూసిన తర్వాత మీకు కన్నీళ్లు ఆగవు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ చిరుత జింకపిల్లను వేటాడుతుంది. దాన్ని తన నోట కరుచుకుని పరిగెత్తుతుంది. అయితే ఇదంతా దూరం నుంచి చూసిన తల్లి జింక తన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలనే లక్ష్యంతో చిరుతను వెంబడిస్తుంది.

అయితే ఈలోపే చిరుత జింకపిల్లను పట్టుకుని చెట్టు ఎక్కేస్తుంది. ఆ చెట్టు చుట్టూ తల్లి జింక ఎంతసేపు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆ జింక పిల్లను నోటను కరుచుకుని చిరుత అక్కడ నుంచి పారిపోతుంది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి జింక ఎంతలా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కనికరం అనేది లేకుండా చిరుత జింకపిల్లను చంపుతుంది. ఈ వీడియోను ‘దినేశ్ దాబి’ అనే నెటిజన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..