AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ ఫోటోలో చిరుత ఉంది.. గుర్తించారా.! కనిపెట్టలేదా.? అయితే ఈ స్టోరీ చదవండి!

లాక్‌డౌన్‌ కారణంగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతీ రోజూ అనేక ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి...

Viral Pic: ఈ ఫోటోలో చిరుత ఉంది.. గుర్తించారా.! కనిపెట్టలేదా.? అయితే ఈ స్టోరీ చదవండి!
Ravi Kiran
|

Updated on: Aug 24, 2021 | 1:40 PM

Share

లాక్‌డౌన్‌ కారణంగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ప్రతీ రోజూ అనేక ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న సమాచారం కొంత ఆనందాన్ని పంచుతుంటే.. మరికొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రపంచ నలుమూలల ఏ వింత జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో దర్శనమివ్వాల్సిందే.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ‘ఫైండ్ ది అబ్జెక్ట్’ ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. ఆ ఫోటోలో ఏ జంతువు ఉంది.? ఎక్కడ ఉంది.? అని గుర్తించడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో నెటిజన్ల మెదడుకు మేత పెడుతోంది. ఎక్కడో అడవి ప్రాంతంలో రాళ్లు, కొండలు ఉన్నాయి. ఆ ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇందులో చిరుత ఉంది గుర్తించండి అని నెటిజన్లకు పజిల్ విసిరాడు. ఆ ఫోటోను చూసినవారు అందులో చిరుత ఎక్కడుందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై లుక్కేయండి.

ఈ ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అభినవ్ గుప్తా తీశారు. జైపూర్ అరవలి హిల్స్‌‌కు ట్రెకింగ్‌కు వెళ్లిన అతడు.. ఈ ఫోటోను తీశాడు. ఇంటికి చేరుకునేవరకు అందులో ఓ చిరుత దాగుందని అతడికి తెలియలేదు. మొదటిసారి అతడికి ఈ ఫోటో చూసిన తర్వాత అందులో చిరుత ఉందని గుర్తించలేకపోయాడు. తీక్షణంగా చూస్తే ఓ మూలన చిరుత సేద తీరుతున్నట్లు కనిపెట్టాడు. మీరు దాన్ని గుర్తించలేకపోయరా.? అయితే క్రింద ఫోటోలో సమాధానం ఉంది… చూడండి.!

Leopard

పైన పేర్కొన్న ఫోటోలో రెడ్ సర్కిల్‌తో చుట్టిన ప్రదేశంలో చిరుత సేద తీరుతోంది. ఈ ఫోటోలోని ప్రదేశం పశ్చిమ భారతదేశంలోని జైపూర్‌ అరవలి హిల్స్. ఈ జూమ్ చేసిన ఫోటో చూడండి.. మీకు చిరుత కనిపిస్తుంది.

Leopard 3

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్