AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: స్కూటీ డిక్కీలో వింత శబ్ధాలు.. భయపడుతూనే ఓపెన్ చేసిన ఓనర్.. ఒక్కసారిగా..

Shocking Video: సాధారణంగా జనాలు చిన్న చిన్న వాటికే హడలిపోతుంటారు. బొద్దింక, బల్లి వంటి చిన్న జీవులు సడన్‌గా కనిపిస్తేనే షాక్ అవుతారు. అలాంటిది ఒక పాము మనకు సమీపిస్తే..

Shocking Video: స్కూటీ డిక్కీలో వింత శబ్ధాలు.. భయపడుతూనే ఓపెన్ చేసిన ఓనర్.. ఒక్కసారిగా..
Scooty
Shiva Prajapati
| Edited By: |

Updated on: Aug 25, 2021 | 7:49 PM

Share

Shocking Video: సాధారణంగా జనాలు చిన్న చిన్న వాటికే హడలిపోతుంటారు. బొద్దింక, బల్లి వంటి చిన్న జీవులు సడన్‌గా కనిపిస్తేనే షాక్ అవుతారు. అలాంటిది ఒక పాము మనకు సమీపిస్తే.. ఇంకేమైనా ఉందా? గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి పరిస్థితినే ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. తాను నిత్యం ప్రయాణించే స్కూటీలోంచి వింత శబ్ధాలు వస్తుంటే.. ఏంటో అనుకుని భయపడ్డాడు. అలా భయం భయంగానే ఆ స్కూటీ డిక్కీని ఓపెన్ చేసి చూశాడు. అందులో భారీ నాగుపాము నక్కి ఉండటం గమనించి హడలిపోయాడు. వెంటనే అటూ ఇటూ పరుగులు తీశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళల్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో పోచయ్య అనే రైతుకు స్కూటీ ఉంది. ఈ స్కూటీపేను అతను రోజూ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటాడు. రోజూ లాగే ఇవాళ కూడా తన స్కూటీపై పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు పోచయ్య. స్కూటీని ఇంట్లోంచి బయటకు తీశాడు. ఈ క్రమంలో స్కూటీలోంచి వింత శబ్ధాలు రావడాన్ని గమనించాడు. బుస్ బుస్ మంటూ శబ్ధాలు వస్తున్నాయి. దాంతో ఆ పోచయ్య కాస్త టెన్షన్ పడ్డాడు. బైక్ వీల్స్‌లో, చక్రంపైన ఏమైనా దూరిందా అని అనుమానంతో పరిశీలించాడు. కానీ ఏమీ లేదు. మరోవైపు బైక్‌ నుంచి వింత శబ్ధాలు వస్తూనే ఉన్నాయి. స్కూటీ డిక్కీలో ఏమైనా ఉండొచ్చు అని భావించాడు. స్కూటీని బయటకు తీసుకువచ్చి మెల్లగా డిక్కీని ఓపెన్ చేశాడు. అతని అనుమానమే నిజమైంది. ఆ డిక్కీలో నాగుపాము దాగి ఉంది. అది చూసి పోచయ్య బెంబేలెత్తిపోయాడు. అటూ ఇటూ తిరుగుతూ చుట్టుపక్కన వారిని పిలిచాడు. స్థానికులు వచ్చి.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్ ధీరేందర్‌కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ధీరేందర్.. ఘటనా స్థలానికి చేరుకుని స్కూటీ డిక్కీ నుంచి నాగు పామును బయటకు తీశాడు. దానికి ఒక బాటిల్‌లో బంధించి.. ఆ తరువాత అడవిలో వదిలి పెట్టారు.

Also read: Revanth Reddy Live Video: సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ రెడ్డి దీక్ష..!దళిత ఆత్మగౌరవ దీక్ష ఏమైయెను..?

Sea Level Rise: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం.. 45 మీటర్ల మేర ముందుకు.. ఆందోళనలో గ్రామస్థులు

Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్‌ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులో సంచలన విషయాలు.

మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.