Viral Video: చిరుత వేటాడితే ఇలానే ఉంటుంది.. గాల్లో తేలియాడుతూ.. డేంజరస్ వీడియో
Leopard Hunted Deer: అరణ్యంలో జీవించడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతీ బలహీన జంతువు.. బలమైన జంతువుకు బలి అవుతుంది. ఏ జంతువు ఎప్పుడు వేటాడుతుందో అటవీ ప్రపంచంలో అంచనా వేయలేం..
Leopard Hunted Deer: అరణ్యంలో జీవించడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతీ బలహీన జంతువు.. బలమైన జంతువుకు బలి అవుతుంది. ఏ జంతువు ఎప్పుడు వేటాడుతుందో అటవీ ప్రపంచంలో అంచనా వేయలేం.. చెప్పలేం.. అయితే.. జంతువులను వేటాడే వీడియోలు తరచుగా సోషల్ మీడియా (social media) లో వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియో (Video Viral) లు చూడటం ద్వారా.. అడవిలో జంతువులు చాలా ప్రమాదకరమైనవని.. అలాంటి క్రూర మృగాల ముందు బలహీనమైన జంతువు జీవించడం చాలా కష్టం అని నిరూపితమవుతుంది. అలాంటి జంతువుల్లో చిరుతపులి ఒకటి. తన ఎరను నిర్దేశించుకుందంటే.. ఎంత దూరమైనా పరిగెత్తి వేటాడుతుంది.
అలాంటి చిరుతపులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వీడియో బాగా పాపులర్ అవుతోంది. దీనిలో ఓ చిరుత.. జింకల గుంపును లక్ష్యంగా చేసుకుంది. చిరుతను చూసిన జింకలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడం ప్రారంభించాయి. అయితే వాటిని వెంబడిస్తున్న చిరుతపులి గాలిలోకి దూకి మరి జింకను పట్టుకుంది. ఈ క్రమంలో చిరుత వేటను చూసి పలువురు చలించిపోతున్నారు. ఈ క్లిప్‌ను IFS అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసారు. దీంతోపాటు ఫ్లయింగ్ క్యాచ్ అంటూ క్యాప్షన్ రాశారు.
వైరల్ వీడియో..
Flying catch? ?life & Nature pic.twitter.com/39ATvCyVck
— Susanta Nanda IFS (@susantananda3) February 11, 2022
కాగా.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవి ప్రపంచంలోని ఈ ప్రమాదకరమైన వీడియోను చూసిన తర్వాత.. చిరుతపులి వేట, చురుకుదనం ముందు.. ఏ జీవి అయినా వెనుకే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత చిరుతపులి ఎంత ప్రమాదకరమో తెలుస్తుందని పేర్కొంటున్నారు.
Also Read: