సినీనటి ఇంట్లో సహాయకుడు..ఇప్పుడు కోటీశ్వరుడు..మనోడికి అదృష్టం వైఫైలా ఉన్నట్లుంది
అదృష్టం ఎప్పడు ఎవరికి ఎలా కలిసొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయే ఘటనలు కూడా జరుగుతాయి.
అదృష్టం ఎప్పడు ఎవరికి ఎలా కలిసొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయే ఘటనలు కూడా జరుగుతాయి. సరిగ్గా అలాంటి తరహాలోనే.. ఓ నటి ఇంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఒక్కసారిగా ధనవంతుడిగా మరిపోయాడు. అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా 1995లో కేరళకు బతుకుదెరువు కోసం వచ్చాడు. గత కొన్నేళ్లుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.అయితే ఇతనికి తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే ఇటీవల కూడా ఎస్ఈ 222282 టికెట్ ను కొన్నాడు. అయితే ఈసారి దెబ్బకు అతని దశ తిరిగిపోయింది. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ ‘సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ’ విడుదల చేసిన ఫలితాలలో ఆల్బర్ట్‌కి ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ డ్రా జరిగింది.
మొదటి బహుమతి పది కోట్లు కాగా రెండవ బహుమతి టికెట్ నంబర్ SB 152330కి లభించింది. ఎర్నాకులంలో విక్రయించిన టిక్కెట్‌లకు మొదటి, రెండు బహుమతులు లభించడం మరో విశేషం. బంపర్ లాటరీ గెలుచుకున్న అల్బర్ట్ ఇందుకు చేయవలసిన ప్రక్రియనుపూర్తి చేసుకుని టికెట్‌ను కొచ్చిలోని ఓ బ్యాంకులో తన లాటరీ టికెట్‌ను సమర్పించాడు. ఇక ఈ లాటరీ లక్కీ డ్రాలో.. రెండో బహుమతి రూ.50 లక్షలుగా, మూడో బహుమతి ఐదు లక్షలు, నాలుగో బహుమతి విజేతకు లక్ష రూపాయలు, ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు లభించనుంది.
NOTE: పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం. జీవితంలో ఎదిగేందుకు లాటరీలను నమ్ముకోవడాన్ని టీవీ9 ప్రోత్సహించదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం