AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన 5 కోట్ల ఆస్తిని రెండు ఏనుగులకు రాసిచ్చాడు.. చివరికి ఏం జరిగిందంటే

ఎవరైనా తల్లిదండ్రులు వారి ఆస్తులను తమ కొడుకులకు, కూతుర్లరు రాసిస్తారు. కానీ బిహార్ లోని

తన 5 కోట్ల ఆస్తిని రెండు ఏనుగులకు రాసిచ్చాడు.. చివరికి ఏం జరిగిందంటే
Man With Elephant
Aravind B
|

Updated on: Mar 21, 2023 | 12:04 PM

Share

ఎవరైనా తల్లిదండ్రులు వారి ఆస్తులను తమ కొడుకులకు, కూతుర్లరు రాసిస్తారు. కానీ బిహార్ లోని ఓ వ్యక్తి రెండు ఏనుగులకు ఏకంగా 5 కోట్లు ఆస్తి రాసిచ్చాడు. జాన్ పూర్ కు చెందిన అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి తన పన్నెండవ ఏట నుంచి రెండు ఏనుగులను చూసుకుంటున్నాడు. వాటికీ మోతి, రాణి అనే పేర్లు కూడా పెట్టాడు. ఆ తర్వాత అక్తర్ ఒక ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ను ప్రారంభించాడు. అయితే అతడు ఓ పదేళ్ల పాటు తన భార్య పిల్లలకు దూరంగా ఉండి నివసించాడు. తనకున్న ఆస్తిలో సగభాగం తన కుటుంబానికి ఇవ్వగా.. మిగతా సగం 5 కోట్ల రూపాయల ఆస్తిని ఆ రెండు ఏనుగుల పేరు మీద రాసిచ్చాడు. ఇలా ఎందుకు చేశావని అక్తర్ ను ప్రశ్నించగా..ఒకసారి తాను ఇంట్లో ఉన్నప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందని.. కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి గన్ తో కాల్చేందుకు యత్నించగా ఆ రెండు ఏనుగులు కాపాడాయని తెలిపాడు.ఏనుగులు మనుషుల్లా కాకుండా తమ విశ్వసాన్ని చూపిస్తాయని అందుకే ఒకవేళ తాను చనిపోయినా వాటి మనుగడకు లోటు ఉండకూడదని ఆస్తి రాసిచ్చినట్లు పేర్కొన్నాడు.

అయితే అక్తర్ తన ఆస్తిని ఏనుగులకు రాసివ్వడం అతని కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన కుటుంబ సభ్యులు ఏనుగులు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాటిని రక్షించాలని పోలీసులను  కోరాడు. ఈ క్రమంలో 2021లో అక్తర్‌ హత్యకు గురయ్యాడు. అప్పటికే వీలునామా రాయడంతో రూ.5 కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు దక్కింది.అయితే ఇటీవల మోతి అనే ఏనుగు కూడా చనిపోవడంతో.. రాణి అనే మరో ఏనుగు ఆ ఆస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతుంది. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంటోంది. ఆస్తి పాట్నాలో ఉంది. ఈ ఆస్తిని ఏనుగుకు సద్వినియోగం చేస్తేనే అక్తర్‌ ఆశయం నెరవేరుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!