AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: హవ్వా! ఫైన్ ఇలా కూడా వేస్తారా? పోలీసుల చలానా చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

నవ్విపోదురుగాక నాకేటి! అన్న చందంగా తయారైంది పోలీసుల వ్యవహారశైలి. వాతావరణానికి ఏమాత్రం హాని చేయని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చలానా వేసి నవ్వులపాలయ్యారు. దీంతో సహజంగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Viral News: హవ్వా! ఫైన్ ఇలా కూడా వేస్తారా? పోలీసుల చలానా చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
Kerala Police Chalan
Madhu
|

Updated on: Mar 21, 2023 | 12:11 PM

Share

ఏమాత్రం అవకాశం ఉన్నా వాహనదారుల చేతి చమురు వదిలించేందుకు పోలీసులు ముందుంటారన్న విమర్శ చాలా కాలం నుంచి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‭ వంటి నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. బండి బయటికి తీయడం ఆలస్యం.. అందరి కంటే ముందు ట్రాఫిక్ పోలీసులే దర్శనం ఇస్తారు. వాళ్లు అడిగినవి ఉన్నాయా పర్లేదు, ఏ ఒక్కటి మిస్సైనా జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఒక్కోసారి అన్నీ ఉన్నా విచిత్రమైన కారణాలు చెప్తూ జరిమానాలు వసూలు చేస్తున్నారని వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. అక్కడి పోలీసులు ఏకంగా పర్యావరణ హితమైన విద్యుత్‌ శ్రేణి వాహనాలకు పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేదని జరిమానా విధించారు. ఆ చాలానా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అయిపోయింది.

పోలీసుల తీరే అంత!

సాధారణంగా మనం ట్రాఫిక్ నిబంధనలను అతి క్రమిస్తే పోలీసులు ఫైన్ వేస్తుంటారు. ట్రిబుల్ రైడింగ్ చేసి, తాగి వెహికల్ నడిపించడం, రాంగ్ రూట్, బెల్ట్ పెట్టుకోకుంటే జరిమాన విధిస్తుంటారు. మరికొన్నిసార్లు.. బండికి సంబంధించిన సరైన కాగితాలు.. లైసెన్స్, ఆర్సీ, పొల్యుషన్, ఇన్సూరేన్స్ లేకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారనే విషయం మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమాన చూసి స్కూటర్ యజమాని షాక్ కు గురయ్యాడు. కేరళలో వింత ఘటన జరిగింది.

ఇది విషయం..

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా నీలంచెరిలో ఇటీవల కాలుష్య రహిత ఏథర్ 450ఎక్స్ బైక్‌కు చలానా వేశారు. అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. పోనీ పొరపాటున వేశారా? అని అనడానికి లేదు. ఆ బండికి ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్‌ కనిపిస్తూనే ఉంది. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 213(5)(ఈ) నిబంధన ఉల్లంఘించినందుకు రూ. 250 జరిమానా విధించినట్లు చలానాలో పోలీసులు తెలిపారు. దీంతో యజమాని షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆ ఫొటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..