Telugu News Trending Jumping from moving airplane video was gone viral in social media Telugu News
Video Viral: నీ గుండె ధైర్యానికి సలాం బాసూ.. గాల్లో ప్రయాణిస్తున్న విమానం నుంచి అమాంతం కిందికి..
మీరు బంగీజంప్ గురించి వినే ఉంటాయి. వేల అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందికి దూకడం మీకు తెలిసే ఉంటుంది. ఇలా చేసేందుకు నిపుణులు, సాహసికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాక సాహసానికి..
మీరు బంగీజంప్ గురించి వినే ఉంటాయి. వేల అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందికి దూకడం మీకు తెలిసే ఉంటుంది. ఇలా చేసేందుకు నిపుణులు, సాహసికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాక సాహసానికి సిద్ధమవుతారు. ఇది తమ జీవితంలో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. కొందరు వేల అడుగుల ఎత్తు నుంచి అమాంతం భూమి మీదకు దూకేస్తుంటారు. ప్యారాచూట్ల సహాయంతో సాహసకృత్యాలు చేస్తారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యా్నికి గురవుతుంటారు. అయితే భూమికి వేల అడుగుల ఎత్తులో గాలిలో ప్రయాణిస్తున్న విమానం నుంచి అమాంతం కిందకు దూకేస్తే.. అది కూడా ఏ మాత్రం రక్షణ చర్యలు చేపట్టకుండా.. వింటూనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ.. కానీ ఈ వీడియో చూశాక అసలు విషయం మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ క్లిప్ ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
Have you ever seen a man jump out of a plane from 25,000 feet with no parachute and then land in a massive net on Earth?
స్కైడైవర్ ల్యూక్ ఐకిన్స్ పారాచూట్, వింగ్ సూట్ లేకుండా విమానం నుంచి 25,000 అడుగుల ఎత్తులో దూకి సురక్షితంగా కిందికి ల్యాండ్ అయ్యాడు. రెండు నిమిషాల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2016లో ట్రెండింగ్ గా నిలిచిన ఈ వీడియో ట్విట్టర్‌లో మళ్లీ ప్రత్యక్షమైంది. అంతే కాకుండా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్‌ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ లైక్ చేయడం విశేషం.