Video Viral: తినమని ఉడతకు ఆహారం అందిస్తే.. అది చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్
ఉడతలు (Squirrels) ప్రకృతి ప్రేమికులు. వీటి కారణంగానే ఏటా లక్షల సంఖ్యలో కొత్త మొక్కలు పుట్టుకొస్తున్నాయి. అవి తమ ఆహారాన్ని భూమిలో గోతి తవ్వి దాచిపెడతాయి. ఆ తర్వాత మరిచిపోతాయి. క్రమంగా అవి మొలకొత్తి మొక్కలు ఉద్భవిస్తాయి...

ఉడతలు (Squirrels) ప్రకృతి ప్రేమికులు. వీటి కారణంగానే ఏటా లక్షల సంఖ్యలో కొత్త మొక్కలు పుట్టుకొస్తున్నాయి. అవి తమ ఆహారాన్ని భూమిలో గోతి తవ్వి దాచిపెడతాయి. ఆ తర్వాత మరిచిపోతాయి. క్రమంగా అవి మొలకొత్తి మొక్కలు ఉద్భవిస్తాయి. అందుకే వాటి మతిమరుపు కారణంగా ప్రకృతికీ మేలు జరుగుతోంది. సోషల్ మీడియాలో (Social Media) ఉడతలకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయి. కొందరు వీటిని ఇంట్లో పెంచుకుంటే మరికొందరు మాత్రం సరదాగా తమ గార్డెన్లలో చూసుకుని మురిసిపోతుంటారు. వాటికి ఆహారం అందించి ఆకలి తీరుస్తారు. అంతే కాకుండా అవి చేసే చేష్టలు కూడా మనకు ఆనందం కలిగిస్తాయి. మనతో త్వరగా కలిసిపోతాయి. వాటితో ఫ్రెండ్షిప్ చేయడం చాలా తేలిక. ప్రస్తుతం ఉడతలకు మనుషులకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఉడతకు ఆహారం అందించడాన్ని చూడవచ్చు. అది ఆహారాన్ని తన చెంపల్లో దాచుకుని అక్కడి నుంచి తుర్రుమంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూట్యూబ్ లో పోస్ట్ అయింది. దీనికి ఇప్పటివరకు ఒక మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీడియో మనసు దోచేస్తోందని, క్యూట్ వీడియో చాలా బాగుందని తమ అభిప్రాయాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా తమకు తెలిసిన వారు, కుటుంబసభ్యులకు వీడియోను షేర్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..