Telugu News Trending Bride drives Bullet Bike video goes viral in Social Media Telugu Viral News
Viral Video: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిన వధువు.. మనసు దోచుకుంటున్న వీడియో
పెళ్లి.. రెండు జీవితాలు ఒక్కటయ్యే అపురూప వేదిక. అందుకే తమ వివాహం వెరైటీగా నిలిచిపోవాలని వధూవరలు కలలుగంటారు. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించుకుంటారు. మరే పెళ్లిలోనూ జరగని పద్ధతులు తమ వివాహంలో జరగాలనుకుంటారు. తమ..
పెళ్లి.. రెండు జీవితాలు ఒక్కటయ్యే అపురూప వేదిక. అందుకే తమ వివాహం వెరైటీగా నిలిచిపోవాలని వధూవరలు కలలుగంటారు. అందుకు తగ్గట్టే ప్రణాళికలు రూపొందించుకుంటారు. మరే పెళ్లిలోనూ జరగని పద్ధతులు తమ వివాహంలో జరగాలనుకుంటారు. తమ వివాహ వేడుకను ప్రత్యేకంగా నిలపాలనుకుంటారు. ఇందు కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. ట్రెండింగ్ అవుతున్న పాటలు, స్టెప్పులు వేస్తూ మరచిపోలేని అనుభూతిగా మార్చుకుంటారు. వివాహాల్లో బరాత్ లు నిర్వహించడం సాధారణమే. బంధువులందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం ఇది. అయితే ఇప్పుడు ఇందులోనూ నూతన వధూవరులు పాల్గొంటూ వివాహ వేడుకలో మరింత జోష్ నింపుతున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. వరుడు లేదా వధువు డ్యాన్స్ చేసే వీడియోలు మనం ఎన్నో చూశాం. ఇలాంటి వీడియోలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వధువు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి నడుపుతూ కనిపిస్తుంది. వివాహ దుస్తుల్లో ఉన్న యువతి బుల్లెట్ బండి నడపుతున్న వీడియో సామాజడిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
“వైశాలి చౌదరి కుటైల్” అనే పేరుతో ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే పది వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వేదల సంఖ్యలో లైక్స్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కొడుకు అదృష్టవంతుడు అని, వీరి బంధం కలకాలం బలంగా నిలిచిపోతుందని తమ అభిప్రాయాన్ని కామెంట్లు రూపంలో వ్యాఖ్యానిస్తున్నారు.