Telugu News Trending Cat drinking water video goes viral in social media Telugu Viral News
Video Viral: ఈ కిట్టీకి ఎవరైనా స్టూల్ ఇవ్వండి.. నీళ్లు తాగేందుకు పిల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ఇంటర్నెట్ (Internet) లో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కంటెంట్‌తో నిండి ఉంది. జంతువులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు ఆసక్తి కలిగిస్తాయి. అవి చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్ని సార్లు కోపం కలిగిస్తాయి. ఇక ఇంట్లో...
ఇంటర్నెట్ (Internet) లో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన కంటెంట్‌తో నిండి ఉంది. జంతువులకు సంబంధించిన వీడియోలు చూసేందుకు ఆసక్తి కలిగిస్తాయి. అవి చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్ని సార్లు కోపం కలిగిస్తాయి. ఇక ఇంట్లో పెంచుకునే జంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్జాగా ఇల్లంతా తిరిగేస్తూ నచ్చిన పని చేస్తుంటాయి. ఇంట్లో మనుషులు చేసే పనులను చూసి వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పిల్లి నీళ్లు తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుబాటులో వాటర్ ఫిల్టర్ ఉండటంతో దాని నుంచి నీరు తాగాలని ప్రయత్నిస్తుంది. ఇందు కోసం తన తెలివిని ఉపయోగించి దాహం తీర్చుకుంటుంది. అచ్చం మనుషులు చేసిన విధంగానే అనుకరిస్తూ నీటిని తాగుతుంది. ఫిల్టర్ బటన్ ను నొక్కి, ఆ తర్వాత వచ్చిన వాటర్ ను గటగటా తాగేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 7.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2.6 లక్షలకు పైగా లైక్‌లు సంపాదించింది. 38,000 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీ-ట్వీట్ చేశారు. “జంతువులు చాలా తెలివైనవి” అని ట్వీట్‌కు ప్రత్యుత్తరం ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కిట్టికి స్టూల్ ఇవ్వండి అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.