AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చెత్తలో దొరికిన పాత కార్పెట్‌.. అతన్ని లక్షాధికారిని చేసింది..! ఎలాగో చూస్తే అవాక్కే..

ఒక స్వర్ణకారుడి దుకాణం నుండి పరవేసిన పాత కార్పెట్ చెత్త ఏరుకునే వ్యక్తికి సంపదను తెచ్చిపెట్టింది. ప్రతిరోజూ వీధుల నుండి చెత్తను సేకరించే ఒక వ్యక్తి ఒక నగల దుకాణం నుండి పాత కార్పెట్‌లోని దుమ్ముదూళిలో రూ. 5.61 లక్షల విలువైన బంగారాన్ని సంపాదించాడు. అదేలా సాధ్యపడిందో వైరల్ వీడియో ద్వారా అతడు ప్రపంచానికి చూపించాడు.

Watch: చెత్తలో దొరికిన పాత కార్పెట్‌..  అతన్ని లక్షాధికారిని చేసింది..! ఎలాగో చూస్తే అవాక్కే..
Jewellery Shop Old Carpet
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2025 | 5:09 PM

Share

బంగారం మెరుపు అందరికీ తెలుసు.. కానీ, పాతబడి, చిరిగిపోయిన కార్పెట్ కూడా కోటీశ్వరుడిని చేయగలదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు విన్నది నిజమే.. ఒక స్వర్ణకారుడి దుకాణం నుండి పరవేసిన పాత కార్పెట్ చెత్త ఏరుకునే వ్యక్తికి సంపదను తెచ్చిపెట్టింది. ప్రతిరోజూ వీధుల నుండి చెత్తను సేకరించే ఒక వ్యక్తి ఒక నగల దుకాణం నుండి పాత కార్పెట్‌లోని దుమ్ముదూళిలో రూ. 5.61 లక్షల విలువైన బంగారాన్ని సంపాదించాడు. అదేలా సాధ్యపడిందో వైరల్ వీడియో ద్వారా అతడు ప్రపంచానికి చూపించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడమే కాకుండా, ఆభరణాల వ్యాపారులు తమ వ్యర్థాలు కూడా అమూల్యమైనవి కావచ్చని హెచ్చరిస్తోంది.

వైరల్‌ వీడియో ప్రకారం, ఒక దుకాణదారుడు తన పాత దుకాణాన్ని పూర్తిగా శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఆ దుకాణం బంగారం, వెండి ఆభరణాలను తయారు చేస్తుంది. అక్కడ ఫైలింగ్, పాలిషింగ్, కటింగ్ సమయంలో బంగారు పొడి రూపంలో గాలిలో ఎగురుతూనే ఉంటుంది. ఈ దుమ్ము కార్పెట్‌పై స్థిరపడుతుంది. కానీ చాలా మంది ఆభరణాల వ్యాపారులు దానిని విస్మరించి పారవేస్తారు. అలాంటిదే ఇక్కడ కూడా ఒక దుకాణదారుడు తన షాపులోని 10 సంవత్సరాల నాటి చిరిగిన కార్పెట్‌ను చెత్త కుప్పలోకి విసిరాడు. కానీ ఈ కార్పెట్ మరొకరి అదృష్టాన్ని మార్చేసింది.

ఇవి కూడా చదవండి

కార్పెట్‌లో దొరికిన నిధి:

చెత్తను సేకరించే ఒక వ్యక్తి వ్యాపారి పడవేసిన కార్పెట్‌ను ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. అక్కడ, కార్పెట్‌పై చాలా ప్రయోగాలు చేశాడు..దానిని కాల్చి రసాయనాలతో కరిగించారు. ఆ తర్వాత దాని నుండి వచ్చిన ఘనపదార్థాలను నిప్పులపై మరిగించాడు. ఎంతో కష్టపడి కార్పెట్ ద్రవం నుండి బంగారాన్ని తీయడం జరిగింది. దానిని తూకం వేసే యంత్రంపై తూకం వేసినప్పుడు, దాని బరువు 47 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో బంగారం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, ఇంత బంగారం విలువ ఐదున్నర లక్షల రూపాయలకు పైగా ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Seethee (@seetheecreator)

స్వర్ణకారుడి దుకాణం నుండి వచ్చే వ్యర్థాలను కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఈ కార్పెట్‌ను బంగారాన్ని సేకరించే ప్రైవేట్ శుద్ధి కర్మాగారానికి తీసుకెళ్లారు. అక్కడి నిపుణులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. మొదట, కార్పెట్‌ను పూర్తిగా కడిగి, కత్తిరించి, ఆపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం (ఆక్వా రెజియా) మిశ్రమంలో ముంచారు. తరువాత బంగారు పొడిని కరిగించడానికి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేశారు. చివరగా, ద్రావణాన్ని ఫిల్టర్ చేసి కాల్చారు. అక్కడ బంగారం వేరు చేయబడింది. ఫలితం? 47 గ్రాముల స్వచ్ఛమైన బంగారం! ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ లక్షల్లో ఉంటుంది. వైరల్‌ వీడియోలో కార్పెట్ నల్లగా పాడుబడిందని స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రాసెస్ చేసిన తర్వాత, అది మెరిసే పసుపు బంగారంగా మారింది.